శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్ధం సినీ దర్శకులు గోపాల్ రెడ్డి, వారితో పాటు కనిగిరి తెలుగుదేశం పార్టీ నేత నరసారెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి వారికి రాహు కేతు పూజలు, శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, అనంతరం శ్రీ మేధా గురు దక్షణమూర్తి సన్నిధిలో వేద ఆశీర్వచనం చేయించి ముక్కంటి తీర్ధ ప్రసాదాలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



