శాంతియుత ఎన్నికల నిర్వహణకు కృషి
వెంకటాచలం, ఫిబ్రవరి 6 (పున్నమి విలేఖరి):
సర్వేపల్లి నియోజకవర్గంలో శాంతియుత ఎన్నికల నిర్వహణకు తాము కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నిడిగుంటపాళెంలో కట్టంరెడ్డి విజయ్ మోహన్ రెడ్డి నివాసంలో శనివారం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో గొడవలను నివారించాలని, ఏకగ్రీవాలకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన కోరారు. పంచాయతీలు ఏకగ్రీవాలు అయితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని, వాటితో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఏకగ్రీవం అయిన చోట
అప్పుడే దృవీకరణ పత్రాలు ఇవ్వొద్దని అధికారులను ఎస్ ఈ సి ఆదేశించడం సమర్థనీయం కాదన్నారు. ఏకగ్రీవాలు అనేది అనాది కాలం నుంచి వస్తుందని, ఇదేం కొత్తది కాదన్నారు. తాను అధికార పార్టీ శాసన సభ్యుడిగా ఎన్నికైన 18 నెలలకే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని స్పష్టం చేశారు. సోమిరెడ్డి మంత్రిగా 15 ఏళ్లల్లో చేయలేనిది తాను 18 నెలల్లో చేసి చూపానని వెల్లడించారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా సరే తమకంటే ఎక్కువ అభివృద్ధి చేసినట్లు సోమిరెడ్డి నిరూపిస్తే ఈ ఎన్నికల్లో ఆ పంచాయతీ వాళ్లకే వదిలేస్తామన్నారు. గ్రామాల్లో చిచ్చు రేపేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎవరు కూడా సోమిరెడ్డి, ఆ పార్టీకి చెందిన కొందరు చోటామోటా నాయకుల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కనుపూరు కోదండరామిరెడ్డి, కట్టంరెడ్డి విజయ్ మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మందల వెంకట శేషయ్య, కొనిదెన భాస్కర్ నాయుడు, మోహన్ నాయుడు, అడపాల ఏడుకొండలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
శాంతియుత ఎన్నికల నిర్వహణకు కృషి వెంకటాచలం, ఫిబ్రవరి 6 (పున్నమి విలేఖరి): సర్వేపల్లి నియోజకవర్గంలో శాంతియుత ఎన్నికల నిర్వహణకు తాము కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నిడిగుంటపాళెంలో కట్టంరెడ్డి విజయ్ మోహన్ రెడ్డి నివాసంలో శనివారం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో గొడవలను నివారించాలని, ఏకగ్రీవాలకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన కోరారు. పంచాయతీలు ఏకగ్రీవాలు అయితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని, వాటితో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఏకగ్రీవం అయిన చోట అప్పుడే దృవీకరణ పత్రాలు ఇవ్వొద్దని అధికారులను ఎస్ ఈ సి ఆదేశించడం సమర్థనీయం కాదన్నారు. ఏకగ్రీవాలు అనేది అనాది కాలం నుంచి వస్తుందని, ఇదేం కొత్తది కాదన్నారు. తాను అధికార పార్టీ శాసన సభ్యుడిగా ఎన్నికైన 18 నెలలకే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని స్పష్టం చేశారు. సోమిరెడ్డి మంత్రిగా 15 ఏళ్లల్లో చేయలేనిది తాను 18 నెలల్లో చేసి చూపానని వెల్లడించారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా సరే తమకంటే ఎక్కువ అభివృద్ధి చేసినట్లు సోమిరెడ్డి నిరూపిస్తే ఈ ఎన్నికల్లో ఆ పంచాయతీ వాళ్లకే వదిలేస్తామన్నారు. గ్రామాల్లో చిచ్చు రేపేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎవరు కూడా సోమిరెడ్డి, ఆ పార్టీకి చెందిన కొందరు చోటామోటా నాయకుల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కనుపూరు కోదండరామిరెడ్డి, కట్టంరెడ్డి విజయ్ మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మందల వెంకట శేషయ్య, కొనిదెన భాస్కర్ నాయుడు, మోహన్ నాయుడు, అడపాల ఏడుకొండలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.