

నరసన్నపేటలోని శర్వాణి విద్యాలయంకు చెందిన విద్యార్థి కే. వంశీ, ఎస్.ఎస్.సి 2025లో స్కూల్ టాపర్‌గా నిలిచాడు.
ఈ విజయాన్ని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం (APPSA) ఆధ్వర్యంలో అక్టోబర్ 19, 2025న నరసన్నపేటలోని ఎన్.ఏ.ఆర్. ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన School Topper Award Celebrations కార్యక్రమంలో వంశీని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వంశీని హృదయపూర్వకంగా అభినందించారు.
వంశీ కృషి, క్రమశిక్షణ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అప్సా అధ్యక్షులు, అప్సా అభిమానులు, నరసన్నపేట మండల విద్యాశాఖాధికారులు, నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, వివిధ మండలాల విద్యార్ధినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కరెస్పాండెంట్స్ తదితరులు పాల్గొన్నారు

