లింబ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి గురుస్వామి గారు తన 14వ అయ్యప్ప మాలధారణలో భాగంగా, స్వాములందరితో కలిసి బాసర నుండి శబరిమల వరకు మహా పాదయాత్రగా ఈ రోజు ఘనంగా బయలుదేరారు.
🔹 ఇందులో భాగంగా లింబ నుండి బాసర మహాపాదయాత్రగా బయలుదేరిన గురుస్వామిని, మార్గమధ్యంలో వాటోలి గురుస్వాములు —J. ఓం ప్రకాష్, వైద్యనాథ్, నగేష్, సాయినాథ్, సుభాష్, ఓంప్రసాద్ — ఘనంగా సన్మానించారు.
🔹 గ్రామ ప్రజలు, భక్తులు, స్వాములు విశేషంగా పాల్గొని గురుస్వామికి పాదాభివందనం చేశారు.
🔹 భక్తి, ఆధ్యాత్మికత నిండిన ఈ వేళ “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో ఊరంతా మార్మోగింది.


