శ్రీకాళహస్తి నవంబర్ 19, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేట సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శి ఆధ్వర్యంలో, పోలీస్ కోటర్స్ 4, 5, 7, 8వ వార్డుల్లో శక్తీ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి సమాజంలో మహిళల భద్రతకు శక్తీ యాప్ ఎంత ముఖ్యమో సిబ్బంది వివరించడంతో స్థానిక మహిళల్లో మంచి అవగాహన కలిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసు సులోచన, శ్రీహిత బృందం పాల్గొని స్థానిక మహిళలకు శక్తీ యాప్ వినియోగం, అత్యవసర సమయాల్లో ఎలా ఉపయోగపడుతుందో, అందుబాటులో ఉండే భద్రతా సేవలను వివరించారు. మహిళల రక్షణ, వెంటనే స్పందించే పోలీస్ సేవలు, SOS ఫీచర్ వంటి అంశాలపై ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యక్ష ప్రదర్శనతో అవగాహన కల్పించారు.

శక్తీ యాప్ పై మహిళలకు అవగాహన కార్యక్రమం