*వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం*
*విమ్స్ లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని పరిరక్షించు కోవచ్చని విశాఖ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని విమ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు ప్రారంభించారు ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల థీమ్ అయిన వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత అనే కార్యక్రమం లో భాగంగా ఆసుపత్రి ఆవరణంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గల కారణాల్లో వ్యక్తిగత అశుభ్రత ఒకటి అని కోవిడ్ టైం లో కూడా వ్యక్తిగత శుభ్రత అనేది ఎంత అవసరమో అనేది మన అందరికీ తెలిసిందన్నారు. మనం మన వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సామాజిక పరిశుభ్రతకు కృషి చేయాలి అన్నారు. నిరంతరం చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పై నృత్యం చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు..


