రాజమహేంద్రవరం :
వోటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన “Book a Call with BLO” అనే నూతన సదుపాయాన్ని
తూర్పు గోదావరి జిల్లాలో ఓటర్లు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.
ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వారు NGSP స్టేట్ నోడల్ ఆఫీసర్ల తో అక్టోబర్ 24న నిర్వహించిన సమావేశంలో వోటర్ అనుభవాన్ని మెరుగుపరచడం, ఫెసిలిటేషన్ చర్యలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ మాడ్యూల్‌ను అమలులోకి తేవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జాతీయ ఫిర్యాదుల సేవా పోర్టల్ Election Commission of India (ECI) నిర్వహిస్తున్న ఒక సమగ్ర ఆన్లైన్ ప్లాట్ఫారం అన్నారు. దీని ద్వారా వోటర్లు తమ ఓటర్ నమోదు, సవరణలు, ట్రాన్స్ఫర్, లేదా BLO సంబంధిత ఫిర్యాదులను నమోదు చేసి తగున తగిన పరిష్కారం పొందవచ్చు అని తెలియ చేశారు.
“Book a Call with BLO” కూడా NGSP ప్లాట్‌ఫాంలో భాగమన్నారు.
వోటర్లు తమ ఓటర్ కార్డు, చిరునామా మార్పులు, సవరణలు లేదా నమోదు సంబంధిత సందేహాలపై నేరుగా **Booth Level Officer (BLO)**తో మాట్లాడటానికి ఈ సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు.
వోటర్లు ECI వెబ్సైట్ లేదా వోటర్ సర్వీస్ పోర్టల్‌లో “Book a Call with BLO” ఆప్షన్‌ను ఎంచుకొని తమ వివరాలు నమోదు చేయవచ్చు అన్నారు. అలా నమోదు చేసిన విన్నపాలకు BLOలు 48 గంటల్లోగా స్పందించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
వోటర్ల సౌకర్యం, పారదర్శకత మరియు సమయోచిత సేవలందించి నప్పేకు ఈ కొత్త మాడ్యూల్ ఎంతో ఉపయుక్త మవుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. అందరూ వోటర్లు తమ ఓటు హక్కుకు సంబంధించిన ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు లేదా సవరణల కోసం ఈ సదుపాయాన్ని వినియోగించు కోవాలని ఆమె కోరారు.


