విశాఖ/గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
మారణాయుధాలతో బహిరంగ ప్రదర్శనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ శ్రేణులు వేట కొడవళ్లు పట్టుకుని ర్యాలీలు నిర్వహించడం శాంతి భద్రతలకు ముప్పని పేర్కొంటూ, ఆర్మ్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి హింసాత్మక రాజకీయాలు పెట్టుబడులను, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. జగన్, వైసీపీ హింస సంస్కృతిని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని పల్లా స్పష్టం చేశారు.


