Sunday, 7 December 2025
  • Home  
  • వైసీపీ శవరాజకీయాలు మానుకోవాలి: రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్
- అల్లూరి సీతారామరాజు

వైసీపీ శవరాజకీయాలు మానుకోవాలి: రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్

శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం కాశీబుగ్గలో దైవ సన్నిధిలో తొక్కిసలాట వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు దైర్యం చెప్పవలసింది పోయి దానిని వైసీపీ పార్టీ నాయకులు రాజకీయం చేయడం దురదృష్టకారమని అరకు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. పాడేరు పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు జీసీసీ చైర్మన్ మాట్లాడారు. కార్తీకమాసం కావడంతో భక్తులందరు దైవ దర్శనం కోసం అధిక సంఖ్యలో వెళ్ళటం వల్ల తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడం తీవ్ర దిగబ్రాంతికి లోనయ్యామని కిడారి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భాధిత కుటుంబాలను పరామర్శించడం, ఓదార్చడం, బాధిత కుటుంబాలను ఆదుకొనే కార్యక్రమం చేస్తుందని జీసీసీ చైర్మెన్ చెప్పారు. పచ్చకామార్లు ఉన్నవాడికి లోకమంత పచ్చగా కనిపించినట్టు ఏ సందర్బంలో అయినా లేక ఏ పరిస్థితిలో అయినా ఎవ్వరు మరణించిన ప్రభుత్వంపై నిందలు మోపడం తప్ప మరి ఏ పని వైసీపీ పార్టీకి లేదని వైసీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చి దైర్యం ఇవ్వాలి తప్ప శవరాజకీయాలు మానుకోవాలని కిడారి అన్నారు. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర మంత్రులు నారా లోకేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపినట్లు జీసీసీ చైర్మన్ తెలియజేశారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వనికి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఉండాలి తప్పితే శవరాజకీయాలు నుండి వైసీపీ పార్టీ నాయకులు బయిటికి రావాలని వైసీపీ పార్టీకి రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ హితావు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి బాకూరు సర్పంచ్ బాకూరు వెంకటరమణ రాజు, మాజీ జడ్పీటీసీ సాగర సుబ్బారావు, దారెలా సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి, శోభకోట సర్పంచ్ పలాసి శశి భూషణం నాయుడు, మాజీ సర్పంచ్ వంతల పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.