Sunday, 14 December 2025
  • Home  
  • వైసీపీ దక్షణ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* మత్స్య కారులకు సహాయం
- విశాఖపట్నం

వైసీపీ దక్షణ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* మత్స్య కారులకు సహాయం

*చెరలో ఉన్న మత్స్యకారులపై కూటమి నిర్లక్ష్యం*.. *తొమ్మిది కుటుంబాలకు అండగనిలిచిన వాసుపల్లి* *బాధిత కుటుంబాలకి రూ. 45,000 లు, రైస్ బ్యాగ్లు అందజేత* *చెర నుండి విడుదలయ్యే వరకు అండగా ఉంటాం*! *వైసీపీ దక్షణ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన నెల్లిమర్ల కు చెందిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.5లక్షలు నష్టపరిహారం ఇచ్చి దైర్యం, భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైసీపీ సమన్వయ కర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆశీలమెట్ట కార్యాలయంలో 9 మత్స్యకార బాధిత కుటుంబాలకు వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో ఒక్కో కుటుంబానికి రూ.5000లు చొప్పున రూ.45,000లు అందించడంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగ్ ను ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. సాధక బాధలు తెలిసిన తోటి మత్స్యకారుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్ననన్నారు. మిత్ర దేశంలో బందీగా ఉన్నవారిని విడిపించడానికి చంద్రబాబుకి మా మత్స్యకారులంటే నిర్లక్ష్యమా? చేతకాని తనమా? అని వాసుపల్లి సూటిగా ప్రశ్నించారు. వైసీపీ హయంలో శత్రుదేశంలో బంధిగా ఉన్న 20మంది మత్స్యకారులను పాకిస్తాను చెర నుండి విడిపించి ఫ్లైట్ లో తీసుకుని వచ్చి.. తీసుకువచ్చి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు తక్షణ సాయం అందించిన మత్స్యకార పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి అని వాసుపల్లి గుర్తుచేశారు. కనీసం నెల్లిమర్ల జనసేన ఎంఎల్ఏ నిస్సిగ్గుగా మాటాడటం సరికాదన్నారు. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అసలు మత్స్యకారులు ఇంత కష్టంలో ఉంటే కనీసం నోరుమెదపక పోవడం సిగ్గుచేటు అన్నారు. కూటమి లో ఉన్న భాగస్వామ్యం గా ఉన్న బీజేపీ కేంద్ర మంత్రికి చంద్రబాబు ఒక ఫోన్ చేస్తే సమస్య కదిలిఉండేది. కనీసం వారిపై కదలిక లేకపోవడం చంద్రబాబు మత్స్యకారులపై చిన్న చూపుకి నిదర్శనం అన్నారు. 950 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న మనకీ ఎందుకింత దౌర్భాగ్యమన్నారు. బోర్డర్ దాటకుండా అలెర్ట్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ మనదేశంలోని మాత్రమే లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైన మత్స్యకారులకు మౌలిక వసతులతో పాటు ఇటువంటివి పునరావృతం కాకుండా కేంద్రం వారికి అండగా నిలవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా 9మంది మత్స్యకార కుటుంబాలకి న్యాయం జరిగేలా వైసీపీ అండగా ఉంటుందని వాసుపల్లి స్పష్టం చేశారు. చెర నుండి విడుధలయ్యే వరకు వారికి రేషన్ కూడా అందిస్తాననని వాసుపల్లి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏరినమ్మ గుడి చైర్మన్ లండ రమణ, జిల్లా జనరల్ సెక్రటరీ గంగళ్ల రామరాజు, జిల్లా సెక్రటరీ బొడ్డు ఆనంద్, బర్రి కొండలరావు, 37 వార్డ్ ప్రెసిడెంట్ ఆకుల యెషు, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ గుంటూ ఆనంద్, చోడిపిళ్లి శివ, వాసుపల్లి ధనరాజు, జిల్లా వాలంటరీ విభాగం వైస్ ప్రెసిడెంట్ దూడ అప్పారావు, జిల్లా బీసీ సెల్ సెక్రటరీ దూడ తాతారావు, చేపల నూకరాజు(బుడ్డి ),వేణు, కంటుముచ్చు సాగర్,చేపల ప్రసాద్,చేపల సతీష్,30 వ వార్డ్ మహిళా ప్రెసిడెంట్ సూరని రాము,దూడ అప్పలరాజు, 38 వ వార్డ్ ప్రెసిడెంట్ గురజాపు రవి,39వ వార్డ్ ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్,స్టేట్ మేధావుల విభాగం సెక్రెటరీ ఈతలపాక విజయ్, చేపల రాజు,సారిపిల్లి అరుణ,చింతకాయల వాసు జిల్లా సౌత్ మత్స్యకారులు నాయకులు పాల్గొన్నారు

*చెరలో ఉన్న మత్స్యకారులపై కూటమి నిర్లక్ష్యం*..

*తొమ్మిది కుటుంబాలకు అండగనిలిచిన వాసుపల్లి*

*బాధిత కుటుంబాలకి రూ. 45,000 లు, రైస్ బ్యాగ్లు అందజేత*

*చెర నుండి విడుదలయ్యే వరకు అండగా ఉంటాం*!

*వైసీపీ దక్షణ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*
*విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి *

బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన నెల్లిమర్ల కు చెందిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.5లక్షలు
నష్టపరిహారం ఇచ్చి దైర్యం, భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైసీపీ సమన్వయ కర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆశీలమెట్ట కార్యాలయంలో 9 మత్స్యకార బాధిత కుటుంబాలకు వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో ఒక్కో కుటుంబానికి రూ.5000లు చొప్పున రూ.45,000లు అందించడంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగ్ ను ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. సాధక బాధలు తెలిసిన తోటి మత్స్యకారుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్ననన్నారు. మిత్ర దేశంలో బందీగా ఉన్నవారిని విడిపించడానికి చంద్రబాబుకి మా మత్స్యకారులంటే నిర్లక్ష్యమా? చేతకాని తనమా? అని వాసుపల్లి సూటిగా ప్రశ్నించారు. వైసీపీ హయంలో శత్రుదేశంలో బంధిగా ఉన్న 20మంది మత్స్యకారులను పాకిస్తాను చెర నుండి విడిపించి ఫ్లైట్ లో తీసుకుని వచ్చి.. తీసుకువచ్చి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు తక్షణ సాయం అందించిన మత్స్యకార పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి అని వాసుపల్లి గుర్తుచేశారు. కనీసం నెల్లిమర్ల జనసేన ఎంఎల్ఏ నిస్సిగ్గుగా మాటాడటం సరికాదన్నారు. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అసలు మత్స్యకారులు ఇంత కష్టంలో ఉంటే కనీసం నోరుమెదపక పోవడం సిగ్గుచేటు అన్నారు. కూటమి లో ఉన్న భాగస్వామ్యం గా ఉన్న బీజేపీ కేంద్ర మంత్రికి చంద్రబాబు ఒక ఫోన్ చేస్తే సమస్య కదిలిఉండేది. కనీసం వారిపై కదలిక లేకపోవడం చంద్రబాబు మత్స్యకారులపై చిన్న చూపుకి నిదర్శనం అన్నారు. 950 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న మనకీ ఎందుకింత దౌర్భాగ్యమన్నారు. బోర్డర్ దాటకుండా అలెర్ట్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ మనదేశంలోని మాత్రమే లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైన మత్స్యకారులకు మౌలిక వసతులతో పాటు ఇటువంటివి పునరావృతం కాకుండా కేంద్రం వారికి అండగా నిలవాలన్నారు.
జగన్మోహన్ రెడ్డి ద్వారా 9మంది మత్స్యకార కుటుంబాలకి న్యాయం జరిగేలా వైసీపీ అండగా ఉంటుందని వాసుపల్లి స్పష్టం చేశారు. చెర నుండి విడుధలయ్యే వరకు వారికి రేషన్ కూడా అందిస్తాననని వాసుపల్లి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏరినమ్మ గుడి చైర్మన్ లండ రమణ, జిల్లా జనరల్ సెక్రటరీ గంగళ్ల రామరాజు, జిల్లా సెక్రటరీ బొడ్డు ఆనంద్, బర్రి కొండలరావు, 37 వార్డ్ ప్రెసిడెంట్ ఆకుల యెషు, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ గుంటూ ఆనంద్, చోడిపిళ్లి శివ, వాసుపల్లి ధనరాజు, జిల్లా వాలంటరీ విభాగం వైస్ ప్రెసిడెంట్ దూడ అప్పారావు, జిల్లా బీసీ సెల్ సెక్రటరీ దూడ తాతారావు, చేపల నూకరాజు(బుడ్డి ),వేణు, కంటుముచ్చు సాగర్,చేపల ప్రసాద్,చేపల సతీష్,30 వ వార్డ్ మహిళా ప్రెసిడెంట్ సూరని రాము,దూడ అప్పలరాజు, 38 వ వార్డ్ ప్రెసిడెంట్ గురజాపు రవి,39వ వార్డ్ ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్,స్టేట్ మేధావుల విభాగం సెక్రెటరీ ఈతలపాక విజయ్, చేపల రాజు,సారిపిల్లి అరుణ,చింతకాయల వాసు జిల్లా సౌత్ మత్స్యకారులు నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.