Tuesday, 31 March 2026
  • Home  
  • వైసిపిప్రభుత్వంలోతిరుపతిలో డీకేటీ భూములు కబ్జా చేసింది ఎవరు మీరు కాదా!
- తిరుపతి

వైసిపిప్రభుత్వంలోతిరుపతిలో డీకేటీ భూములు కబ్జా చేసింది ఎవరు మీరు కాదా!

తిరుపతి ప్రెస్ క్లబ్ లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రెస్ మీట్. పున్నమి ప్రతినిధి , 31 మార్చి తిరుపతి సోమవారం రోజు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ పై కౌంటర్ గా మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుచానూరు ఆలయానికి సమీపంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం చాలా దారుణం. మా అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు ని, నారా లోకేష్ ని విమర్శించే స్తాయి కరుణాకర్ రెడ్డికి లేదు. మీ వైసీపీ పాలనలో తిరుపతిలో డీకేటి ప్రభుత్వ భూములను కబ్జా చేసింది మీరు కాదా. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు, ఆర్థికంగా ఎదుగుదలకు అవకాశం కల్పిస్తుంది మా కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రైవేట్ హోటల్ కి ప్రభుత్వ ధర ప్రకారమే స్థలాన్ని నియమ నిబంధనలకు లోబడి వారికి ఇచ్చారు. స్థలాన్ని కేటాయించిన వ్యక్తులకు గాని సంస్థలకు గాని లోకేష్ బాబు కి ఎలాంటి సంబంధం లేదు. బినామీ వ్యక్తులతో స్థలాలు సేకరించాల్సినంత అవసరం లోకేష్ కి లేదు…. వారి కుటుంబం ప్రజాసేవ చేయడానికి పరితపిస్తుంది. మంత్రి నారా లోకేష్ ని గోటికి కూడా సరిపోరు మీరు మీ నాయకులు .కరుణాకర్ రెడ్డికి శాపం ఉంది … ఆయన మాట్లాడే ప్రతి మాట అపద్ధమే.కూటమి ప్రభుత్వం లో అన్యాయానికి , భూకబ్జాలకు ,రౌడీ రాజకీయాలకు తావులేదు.గత వైసిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సర్వనాశనాశనం చేశారు. అభివృద్ధి అంటే మీ వైసిపి భాషలో గంజాయి సెంటర్లు , మీ నాయకులు బయట రాష్ట్రాలలో స్థిరపడడం కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తుంది.తిరుమల తిరుపతి ని అడ్డంపెట్టుకొని రాజకీయం చేయడం తగదు కరుణాకర్ రెడ్డి.తిరుపతి అభివృద్ధి కి అడ్డుపడకండి.మీ పాలనలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్ లు ఇతర ఉన్నతాధికారులను జైళ్లకు పంపిన ఘనత వైసిపి నాయకులది . మా అధి నాయకుడు , కార్యకర్తలు అందరూ నియమ నిబంధనలు లోబడి ఉంటాం. ప్రజా పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం మాత్రమే …. కరుణాకర్ రెడ్డి మరియు వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న తిరుపతి అభివృద్ధిని ఓర్వలేక అడ్డుపడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి , నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి ప్రెస్ క్లబ్ లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రెస్ మీట్.

పున్నమి ప్రతినిధి , 31 మార్చి తిరుపతి

సోమవారం రోజు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ పై కౌంటర్ గా మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తిరుచానూరు ఆలయానికి సమీపంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం చాలా దారుణం.
మా అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు ని, నారా లోకేష్ ని విమర్శించే స్తాయి కరుణాకర్ రెడ్డికి లేదు.
మీ వైసీపీ పాలనలో తిరుపతిలో డీకేటి ప్రభుత్వ భూములను కబ్జా చేసింది మీరు కాదా. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు, ఆర్థికంగా ఎదుగుదలకు అవకాశం కల్పిస్తుంది మా కూటమి ప్రభుత్వం.
అందులో భాగంగానే ప్రైవేట్ హోటల్ కి ప్రభుత్వ ధర ప్రకారమే స్థలాన్ని నియమ నిబంధనలకు లోబడి వారికి ఇచ్చారు. స్థలాన్ని కేటాయించిన వ్యక్తులకు గాని సంస్థలకు గాని లోకేష్ బాబు కి ఎలాంటి సంబంధం లేదు.
బినామీ వ్యక్తులతో స్థలాలు సేకరించాల్సినంత అవసరం లోకేష్ కి లేదు…. వారి కుటుంబం ప్రజాసేవ చేయడానికి పరితపిస్తుంది.
మంత్రి నారా లోకేష్ ని గోటికి కూడా సరిపోరు మీరు మీ నాయకులు .కరుణాకర్ రెడ్డికి శాపం ఉంది … ఆయన మాట్లాడే ప్రతి మాట అపద్ధమే.కూటమి ప్రభుత్వం లో అన్యాయానికి , భూకబ్జాలకు ,రౌడీ రాజకీయాలకు తావులేదు.గత వైసిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సర్వనాశనాశనం చేశారు.
అభివృద్ధి అంటే మీ వైసిపి భాషలో గంజాయి సెంటర్లు , మీ నాయకులు బయట రాష్ట్రాలలో స్థిరపడడం కాదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తుంది.తిరుమల తిరుపతి ని అడ్డంపెట్టుకొని రాజకీయం చేయడం తగదు కరుణాకర్ రెడ్డి.తిరుపతి అభివృద్ధి కి అడ్డుపడకండి.మీ పాలనలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్ లు ఇతర ఉన్నతాధికారులను జైళ్లకు పంపిన ఘనత వైసిపి నాయకులది . మా అధి నాయకుడు , కార్యకర్తలు అందరూ నియమ నిబంధనలు లోబడి ఉంటాం.
ప్రజా పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం మాత్రమే …. కరుణాకర్ రెడ్డి మరియు వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న తిరుపతి అభివృద్ధిని ఓర్వలేక అడ్డుపడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి , నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.