Saturday, 19 July 2025
  • Home  
  • వైయస్‌ హయాం నాటి పథకాలను పూర్తి చేయండి
- Featured - ఆంధ్రప్రదేశ్

వైయస్‌ హయాం నాటి పథకాలను పూర్తి చేయండి

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పిలుపు నెల్లూరు, అక్టోబర్‌ 23 (పున్నమి విలేకరి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్రెడ్డి హయాంలో చేపట్టిన పలు పథకాలను ఇప్పుడు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టరేట్లోని జూబ్లీహాలులో బుధవారం జరిగిన సాగునీటి సలహా సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గత ఐదేళ్లుగా వర్షాలు లేక పోవడం వల్ల రైతాంగం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నదని తెలిపారు. అయితే జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత  వర్షాలు కురిసి జిల్లాలోని జలాశయాల్లో దాదాపు 100 టీఎంసీలకు పైన నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు జిల్లాలోని రైతాంగానికి మొదటి పంటకు నీటి కొరత లేదని, అయితే నీటి యాజమాన్యం చక్కగా జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. గత నాలుగైదు ఏళ్లుగా ఈ విషయంలో అధికారులు తగిన శ్రద్ధ లేదని పేర్కొన్నారు. ఒక్క టీఎంసీ నీటితో దాదాపు 14 వేల ఎకరాలు పండించామని తెలిపారు .గతంలో ఇది అమలు చేసి విజయం సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారులు తగిన శ్రద్ధ చూపినట్లయితే నీరు సమ ద్ధిగా లభించి రెండో పంట పడుతుందని పేర్కొన్నారు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ,నీటిపారుదల శాఖ అధికారులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి మరో 20 టీఎంసీల నీటిని తెచ్చినట్లయితే కండలేరు జలాశయం 50 టీఎంసీలకు నిల్వ చేరుతుందని తెలిపారు వైయస్‌ హయాంలో చేపట్టిన ప్ధకాలను గత ప్రభుత్వాలు వాటిని పూర్తి చేయలేదని, ఇప్పుడైనా వాటిని పూర్తి చేసినట్లయితే బాగుంటుందని సూచించారు. రైతులు కూడా ఈ పథకాల వల్ల ఎంతో లబ్ధి పొంది జీవితాంతం గుర్తు పెట్టుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. రెండో పంటకు నీరు ఇచ్చే విషయంలో అధికారులు ప్రత్యేక ద ష్టి పెట్టాలని, అలాగే రైతులకు ఎప్పుడు ఇచ్చేది తెలపాలని కోరారు సాగునీటి సలహా సంఘ సమావేశానికి మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ గౌతమ్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షత వహించారు జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేల తో పాటు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి విజయ డైరీ చైర్మన్‌ రంగారెడ్డి సాగునీటి సంఘాల నేతలు జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ తమ ప్రాంతాల పరిధిలోని సాగునీటి వెతలను సమావేశం దష్టికి తీసుకువచ్చారు.

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పిలుపు
నెల్లూరు, అక్టోబర్‌ 23 (పున్నమి విలేకరి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్రెడ్డి హయాంలో చేపట్టిన పలు పథకాలను ఇప్పుడు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టరేట్లోని జూబ్లీహాలులో బుధవారం జరిగిన సాగునీటి సలహా సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గత ఐదేళ్లుగా వర్షాలు లేక పోవడం వల్ల రైతాంగం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నదని తెలిపారు.

అయితే జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత  వర్షాలు కురిసి జిల్లాలోని జలాశయాల్లో దాదాపు 100 టీఎంసీలకు పైన నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు జిల్లాలోని రైతాంగానికి మొదటి పంటకు నీటి కొరత లేదని, అయితే నీటి యాజమాన్యం చక్కగా జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. గత నాలుగైదు ఏళ్లుగా ఈ విషయంలో అధికారులు తగిన శ్రద్ధ లేదని పేర్కొన్నారు. ఒక్క టీఎంసీ నీటితో దాదాపు 14 వేల ఎకరాలు పండించామని తెలిపారు .గతంలో ఇది అమలు చేసి విజయం సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారులు తగిన శ్రద్ధ చూపినట్లయితే నీరు సమ ద్ధిగా లభించి రెండో పంట పడుతుందని పేర్కొన్నారు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ,నీటిపారుదల శాఖ అధికారులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

అలాగే శ్రీశైలం జలాశయం నుంచి మరో 20 టీఎంసీల నీటిని తెచ్చినట్లయితే కండలేరు జలాశయం 50 టీఎంసీలకు నిల్వ చేరుతుందని తెలిపారు వైయస్‌ హయాంలో చేపట్టిన ప్ధకాలను గత ప్రభుత్వాలు వాటిని పూర్తి చేయలేదని, ఇప్పుడైనా వాటిని పూర్తి చేసినట్లయితే బాగుంటుందని సూచించారు. రైతులు కూడా ఈ పథకాల వల్ల ఎంతో లబ్ధి పొంది జీవితాంతం గుర్తు పెట్టుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. రెండో పంటకు నీరు ఇచ్చే విషయంలో అధికారులు ప్రత్యేక ద ష్టి పెట్టాలని, అలాగే రైతులకు ఎప్పుడు ఇచ్చేది తెలపాలని కోరారు సాగునీటి సలహా సంఘ సమావేశానికి మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ గౌతమ్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షత వహించారు జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేల తో పాటు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి విజయ డైరీ చైర్మన్‌ రంగారెడ్డి సాగునీటి సంఘాల నేతలు జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ తమ ప్రాంతాల పరిధిలోని సాగునీటి వెతలను సమావేశం దష్టికి తీసుకువచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.