శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి నియోజికవర్గ తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అతి హేయమైన చర్యలగూర్చి పత్రిక ముఖంగా ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ కల్తీ చేసిన మహాపాపం కప్పి పుచ్చుకోవడానికి వేంకటేశ్వర స్వామి చిత్రాలను అపవిత్రం చేసి మరో మహాపరాధానికి పాల్పడిన జగన్ రెడ్డి, అతని సైకో వైసీపీ శాసనమండలి సభ్యులు హైందవ సమాజ ద్రోహులని ఆరోపణలు చేశారు. శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ, స్వామి వారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హిందూ దేవతలను అవమానించడమే లక్ష్యంగా వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డి, అతని బృందం హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. కల్తీ చేసిన నేరస్తుల పై చర్చ లేకుండా, స్వామి మీదకు చర్చను తీసుకుని వస్తారా ? చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలతో రావడం అనైతికం అని తెలిసీ.. వైసీపీ సభ్యులు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, రెచ్చగొట్టి దేవుడిని అవమానించిన వైసీపీ సభ్యులు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్‌ని లక్ష్యంగా చేసుకొని సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసిందని కేసును విచారించిన కోర్టు వైసీపీ ప్రచారాన్ని ఫేక్ ప్రచారం అని తేల్చిందన్నారు. దీనికి సంబంధించిన వార్తలు, పోస్టుల లింకులను 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు ఆదేశించింది. దీనిని ప్రజల దృష్టి నుండి మరల్చడానికి జగన్ రెడ్డి డైరెక్షన్ లో వైసిపికి చెందిన శాసనమండలి సభ్యులు నీచాతినీచమైన చర్యలకు పాల్పడి,కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి ఎలాగైతే చెప్పులతోనే ఆలయ ప్రాంగణం అంతా తిరిగాడో, అలాగే వైసీపీ నేతలు శాసనమండలిలో చెప్పులు, బూట్లు వేసుకునే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకున్నారని,ఇంత అపచారం చేసిన వారు తమ తప్పులకు లెంపలు వేసుకొని హిందువులకు క్షమాపణలు కోరాల్సింది పోయి… అడ్డంగా అబద్దాలు చెబుతూ ఛాలెంజ్ లు చేస్తున్న వీళ్ళను వెంకన్న స్వామే తగిన విధంగా శిక్షించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వైయస్ జగన్.. హైందవ సమాజ ద్రోహి -డా.యం.ఉమేష్