పున్నమి 05 నవంబర్:
దుత్తలూరు నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం, కొత్తపేట గ్రామంలో భక్త జనులచే నిర్మించబడిన నూతనాలయము నందు శ్రీ అడవి పేరంటాలమమ్ము సింహవానము శిఖర కలశము మొదలైంది దేవతా విగ్రహముల ప్రతిష్టా మహోత్సవములు. గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా విగ్రహ ప్రతిష్ట లో పాల్గొంటున్నారు మంగళవాయిధ్యములు, వేదమంత్రస్వస్తి, యజమానులు
యాగశాలా ప్రవేశము, జ్యోతి ప్రజ్వలన, శ్రీ మహాగణపతి పూజ, స్వసిత పుణ్యాహవాచనమ్, దీక్షా కంకణ ధారణ, పంచగవ్య ప్రోసన, అఖండల ప్రజ్వలన, ప్రధాన కలశస్థాపన, పంచబ్రహ్మమండల, సర్వతోభద్రమండల, నవగ్రహ యోగిని, వాస్తు, క్షేత్రపాలక మండల దేవతావాహగమ్, విగ్రహములు, యాగశాల ప్రవేశము, పంచామృత అధివాసము, పూజలు, తీర్ధప్రసాదములు.
వల్మీపూజ, మృత్తికాసంగ్రహణ, అంకురారోపణ, యంత్రపూజలు, అవాహిత మండల దేవతా హెూమములు, విగ్రహములు, జలాధివాసం, పూజలు, తీర్థప్రసాదములు అన్నదాన వసతి కూడా గ్రామ ప్రజలు సమకూర్చారు


