“ఓం నమో శ్రీరామ ఓం” శ్రీరామ జపంతో 1000 మంది భక్తులు
పున్నమి ప్రతినిధి,రామచంద్రపురం
రామచంద్రపురం మండలంలోని కొత్త కండ్రిగ సమీపం లో ఉన్న ప్రాణ యోగ ఆశ్రమంలో ఆశ్రమం వ్యవస్థా పకులు కైలాస్ గురూజీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం లో 1000 మంది రామ భక్తులతో” ఓం నమో శ్రీ రామ ఓం” శ్రీరామ జపంతో ఏకధాటిగా చేతులు కలిపి కైలాస్ గురూజీ రామ జపం పట్టించారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు భక్తి శ్రద్ధలతో రామ జపం నిర్వహిస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ భక్తులందరికీ నిత్య అన్నదాన వితరణ చేశారు.



