Thursday, 26 March 2026
  • Home  
  • వైద్య శిబిరాన్ని సందర్శించిన బీజేపీ నేతలు
- ఆంధ్రప్రదేశ్

వైద్య శిబిరాన్ని సందర్శించిన బీజేపీ నేతలు

పున్నమి న్యూస్, సీనియర్ జర్నలిస్ట్ రమణ: పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామ సచివాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ విజయ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ పచ్చిమాల బేబీ కుమారి గోపి అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సందర్శించారు. మొదటగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వారు ప్రధాని మోడీ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెంచలుగా ఎదిగి తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు మన బలం ఏంటో చూపించారన్నారు. మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు. తన అవిశ్రాంత కృషితో భారతదేశానికి కొత్త దిశానిర్దేశం చేశారని అన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార ఎగ్జిబిషన్ పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను శాలువా తో ఘనంగా సత్కరించి, వారికి కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ముద్రగడ నరసింహారావు(చంటి), సేవా పక్వాడ్ మండల ఇంచార్జిలు మోకా ఆదిలక్ష్మి, మిద్దె రవి రాజ్, రాష్ట్ర నాయకులు ఆకుమర్తి బేబీ రాణి, యనమదల రాజ్యలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి మొగలి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.