Sunday, 7 December 2025
  • Home  
  • వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ.
- తూర్పు గోదావరి

వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ.

* టెండర్ల పేరుతో తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టబెట్టేందుకు కుట్ర * వైద్య ఆరోగ్య శ్రీ వెంటనే పునరుద్ధరించాలి * పేదల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ఆలంబిస్తున్న కూటమి ప్రభుత్వం * మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం * మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, వైయస్సార్ కాంగ్రెస్, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విమర్శ రాజమహేంద్రవరం : వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఎంపీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. శుక్రవారం మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా స్థానిక 48, 44, 43వ వార్డుల, సిటిఆర్‌ఐ సమీపంలోని పనసచెట్టు సెంటర్‌ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, వైసిపి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్‌ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో వహించారు. వైసిపి నాయకులు హాజరయ్యారు. మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ సేకరించిన సంతకాలను గవర్నర్‌కు అందచేయడంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని భరత్‌ రామ్ వెల్లడించారు. స్థానిక ప్రజల సమస్యలు వింటుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం చేయించుకోవాలంటే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎవరూ పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే లక్షలాది రూపాయలు అడుగుతున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదని ప్రశ్నించారు. పేద ప్రజలు ఎక్కడికి వెళ్లి వైద్య చేయించుకోవాలని ప్రశ్నించారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ఆలంబిస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ కు రూ 400 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, అవి సుమారు 3 నెలల బకాయిలు ఉంటాయని అన్నారు. ఆ బకాయిలను గత ప్రభుత్వంతో పోల్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పే కల్లబొల్లి మాటలు మోసకరమైన మాటలు గమనిస్తున్నారని తగిన సమయంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు పరం చేసి వైద్య విద్యను, వ్యాపారం చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. అజ్జరపు వాసు కార్పొరేటర్‌గా పోటీచేస్తారని ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల పిల్లలు డాక్టర్లు కావాలంటే కలగాలనే మిగిలిపోయిందని, వారి కలను సాకారం చేసేందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన హాయంలోనే 7 మెడికల్ కాలేజీ లకు శంకుస్థాపన చేసి నిర్మాణం జరిగిందని అన్నారు. 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వైద్యాన్ని వ్యాపారంగా చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయం అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల ఆస్తిని కాపాడుకోవడానికి యుద్ధం చేయడానికైనా వైసిపి సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

* టెండర్ల పేరుతో తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టబెట్టేందుకు కుట్ర

* వైద్య ఆరోగ్య శ్రీ వెంటనే పునరుద్ధరించాలి

* పేదల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ఆలంబిస్తున్న కూటమి ప్రభుత్వం

* మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం

* మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, వైయస్సార్ కాంగ్రెస్, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విమర్శ

రాజమహేంద్రవరం :

వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఎంపీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. శుక్రవారం మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా స్థానిక 48, 44, 43వ వార్డుల, సిటిఆర్‌ఐ సమీపంలోని పనసచెట్టు సెంటర్‌ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, వైసిపి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్‌ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో వహించారు. వైసిపి నాయకులు హాజరయ్యారు. మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ సేకరించిన సంతకాలను గవర్నర్‌కు అందచేయడంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని భరత్‌ రామ్ వెల్లడించారు. స్థానిక ప్రజల సమస్యలు వింటుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం చేయించుకోవాలంటే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎవరూ పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే లక్షలాది రూపాయలు అడుగుతున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదని ప్రశ్నించారు. పేద ప్రజలు ఎక్కడికి వెళ్లి వైద్య చేయించుకోవాలని ప్రశ్నించారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ఆలంబిస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ కు రూ 400 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, అవి సుమారు 3 నెలల బకాయిలు ఉంటాయని అన్నారు. ఆ బకాయిలను గత ప్రభుత్వంతో పోల్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పే కల్లబొల్లి మాటలు మోసకరమైన మాటలు గమనిస్తున్నారని తగిన సమయంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు పరం చేసి వైద్య విద్యను, వ్యాపారం చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. అజ్జరపు వాసు కార్పొరేటర్‌గా పోటీచేస్తారని ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల పిల్లలు డాక్టర్లు కావాలంటే కలగాలనే మిగిలిపోయిందని, వారి కలను సాకారం చేసేందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన హాయంలోనే 7 మెడికల్ కాలేజీ లకు శంకుస్థాపన చేసి నిర్మాణం జరిగిందని అన్నారు. 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వైద్యాన్ని వ్యాపారంగా చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయం అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల ఆస్తిని కాపాడుకోవడానికి యుద్ధం చేయడానికైనా వైసిపి సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.