*వైద్య రంగంలో ఏఐ పాత్ర కీలకం*
*ఐదేళ్లలో గణనీయ మార్పులు*
*సెషన్ 8 లో వక్తలు*
*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి*:
వైద్యారోగ్య రంగంలో కృత్రిమ మేధ భవిష్యత్తులో కీలకం కానుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా శుక్రవారం 3 వ సెమినార్ హాలులో 8 వ ప్లీనరీ సెషన్ ‘ఇండియా ప్రెసిషన్ మెడిసిన్ లీప్ హేమషింగ్ ఏఐ అండ్ జీనోమిక్స్ ఫర్ వికసిత్ భారత్ ‘ అంశంపై జరిగింది. పి డబ్ల్యుసి ఇండియా హెల్త్ కేర్ లీడ్ అండ్ సీనియర్ పార్టనర్ డాక్టర్ రానా మెహతా మోడరేటర్ గా వ్యవహరించిన ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ, వైద్యారోగ్యరంగంలో డేటా విశ్లేషణ ముఖ్యమని పేర్కొన్నారు. దీనిలో ఏఐ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. జన్యు క్రమం విశ్లేషణ ద్వారా వ్యాధుల నిర్ధారణకు కూడా ఏఐ దోహదం చేస్తుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏఐ కారణంగా వైద్యారోగ్య రంగంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాల ద్వారా శస్త్ర చికిత్సలు కూడా జరుగుతాయని చెప్పారు. ఖచ్చితమైన వైద్యం, జీనోమిక్స్ లో విప్లవాత్మక మార్పులు తధ్యమని స్పష్టం చేశారు. ఈ సెషన్లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, సిఐఐ నేషనల్ కమిటీ ఆన్ హెల్త్ టెక్నాలజీ సీఈవో ప్రశాంత్ టాండన్, సిఐఐ నేషనల్ మెడికల్ టెక్నాలజీ ఫోరం ఎండి గౌరవ్ అగర్వాల్, అవెస్ట జెన్ లిమిటెడ్ సిఎండి డాక్టర్ విల్లు మోర్వాల పాటిల్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సిడిఓ డాక్టర్ రేచెస్ ఎల్లా, వెల్కమ్ మెడిటిక్ లిమిటెడ్ గ్రూప్ సిఎఫ్ఓ సుధీప్ ధరైవాలా, ఏఐజీ హాస్పిటల్స్ సిటీవో డాక్టర్ కింజల్ సక్సేనా తదితరులు పాల్గొన్నారు.

