వైద్య కళాశాలల ప్రైవేటుపరం ఆలోచన విరమించుకోవాలి..
వైద్య కళాశాల ప్రైవేటుపరం ఆలోచన పేదలను, మధ్యతరగతి ప్రజలను మోసం చేయడమే.
వత్తలూరు సాయికిషోర్ రెడ్డి,
తల్లెం భరత్ కుమార్ రెడ్డి.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నవంబర్ 13 ( న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఓబులవారిపల్లి మండలం పెద్దవరంపాడు,రాళ్లచెరువు పల్లి, ఎల్లయ్యపల్లి పంచాయతీల నందు మండల కన్వీనర్, మాజీ జెడ్పిటిసి, మాజీ టూరిజం డైరెక్టర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న గుంతకల్లు రైల్వే డిఆర్సిసి సభ్యులు, రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి. తదనంతరం తల్లెం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చినప్పటినుండి మన ఆంధ్రప్రదేశ్లో 5 వైద్య కళాశాలలు ఉండేవని, వాటిలో 3 కళాశాలలు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో వచ్చాయని, తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు వైద్యం అందాలని, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో ఖర్చుల భారం ఎక్కువ అయ్యాయని, పేదలు ఖర్చు భరించలేరని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 17 మెడికల్ కళాశాలలో మంజూరు చేయించారని, 5 మెడికల్ కళాశాలను పూర్తి చేయగా, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రవేటు పరం చేసేందుకు సిద్ధమవుతుందని అందుకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలోనూ కోటము ప్రభుత్వం చేపడుతున్న పిపిపి విధానాన్ని నిరసిస్తూ చేసిన కార్యక్రమమే రచ్చబండని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి జిల్లా ప్రధాన కార్యదర్శి టంగుటూరు కృష్ణారెడ్డి, ఎల్లాయపల్లి సర్పంచ్ జరుగు నారాయణరెడ్డి,సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాపి రెడ్డి, శ్రీనివాసులు , సర్పంచ్ ఆళ్ల ఈశ్వరయ్య, ఎంపీటీసీ గంగాధరం, సుబ్బరాయుడు,దీపక్ రెడ్డి, పోలి వెంకటరెడ్డి,దార్ల రమణ, మరే సుకుమార్ ,ప్రభుదాస్,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

