Monday, 30 March 2026
  • Home  
  • వైద్యులు నూతన వైద్య విధానాలపై అవగాహన పెంచుకోవడం అవసరం: ఐ.ఎమ్.ఏ.రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ
- Blog

వైద్యులు నూతన వైద్య విధానాలపై అవగాహన పెంచుకోవడం అవసరం: ఐ.ఎమ్.ఏ.రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ

నంద్యాల,కర్నూలు జిల్లాల యూరాలజీ సంఘాల సంయుక్త నిర్వహణ లో నంద్యాల లో శనివారం ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల రెండు రోజుల జెనిటో యూరినరీ సర్జన్స్ సొసైటీ (జననేంద్రియ మూత్ర సంబంధిత శస్త్ర చికిత్స నిపుణుల సొసైటీ) రాష్ట్రస్థాయి సదస్సు. స్థానిక సౌజన్య కన్వెన్షన్ సెంటర్ లో శనివారం సాయంత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సంఘం అధ్యక్షులు డాక్టర్ జగదీశ్వర్ అధ్యక్షతన,కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్,నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య,నిర్వాహక కార్యదర్శి డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డిల నిర్వహణ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశ్రాంత ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఉభయ తెలుగు రాష్ట్రాలలో యూరాలజీ కి ఆద్యులు డాక్టర్ విక్రమ సింహా రెడ్డి,దక్షిణ భారత యూరాలజీ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్ర మోహన్, ఐ.ఎమ్.ఏ.రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అతిధులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ముఖ్య అతిథి డాక్టర్ విక్రమసింహా రెడ్డి మాట్లాడుతూ యూరాలజీ విభాగంలో గత దశాబ్ద కాలంలో అధునాతన వైద్య విధానాలు,పరికరాలు అందుబాటులోకి వచ్చాయని తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం వచ్చిందన్నారు. దక్షిణ భారత యూరాలజీ సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ యూరాలజీలో కూడా కృత్రిమ మేధ వినియోగంతో అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలు చేయడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సంఘం అధ్యక్షులు డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ గతంలో నగరాలకే పరిమితమైన యూరాలజీ వైద్యం నేడు చిన్న పట్టణాలలో కూడా అందుబాటులోకి రావడం హర్షనీయమన్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్య సదస్సుల ద్వారా వైద్యులు వైద్యరంగంలో వస్తున్న నూతన విధానాలు, ఆధునిక మార్పులపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఉపయోగపడుతుందన్నారు.ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో పేద ప్రజలకు యూరాలజీ సేవలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సంఘం( సోగస్) కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా కొనసాగుతున్నప్పటికీ యూరాలజీ సంఘం ఐక్యతతో కొనసాగుతూ వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ, రాష్ట్రస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల జిల్లాల యూరాలజీ సంఘాల సంయుక్త నిర్వహణలో నంద్యాలలో సదస్సు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తనతో పాటు డాక్టర్ జై బాబు రెడ్డి ,డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ దాసరి రమేష్ ,నంద్యాల వైద్యుల సంఘం సహకారంతో నంద్యాలలో మొట్టమొదటిసారిగా సూపర్ స్పెషాలిటీ రాష్ట్రస్థాయి ఉభయ రాష్ట్రాల సదస్సు నిర్వహించడం నంద్యాలకు గర్వకారణం అన్నారు.నంద్యాలలో యూరాలజీ విభాగంలో మూత్రపిండాలు, మూత్రాశయ,మూత్ర నాళ,జననేంద్రియ జబ్బులకు అత్యంత ఆధునిక వైద్య వసతులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ సందర్భంగా డాక్టర్ విక్రమసింహారెడ్డి ,డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ రవి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులుగా పాల్గొన్న డాక్టర్ పనిల్ కుమార్ లను నిర్వాహక కమిటీ ఘనంగా సత్కరించారు.

నంద్యాల,కర్నూలు జిల్లాల యూరాలజీ సంఘాల సంయుక్త నిర్వహణ లో నంద్యాల లో శనివారం ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల రెండు రోజుల జెనిటో యూరినరీ సర్జన్స్ సొసైటీ (జననేంద్రియ మూత్ర సంబంధిత శస్త్ర చికిత్స నిపుణుల సొసైటీ) రాష్ట్రస్థాయి సదస్సు.
స్థానిక సౌజన్య కన్వెన్షన్ సెంటర్ లో శనివారం సాయంత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సంఘం అధ్యక్షులు డాక్టర్ జగదీశ్వర్ అధ్యక్షతన,కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్,నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య,నిర్వాహక కార్యదర్శి డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డిల నిర్వహణ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశ్రాంత ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఉభయ తెలుగు రాష్ట్రాలలో యూరాలజీ కి ఆద్యులు డాక్టర్ విక్రమ సింహా రెడ్డి,దక్షిణ భారత యూరాలజీ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్ర మోహన్,
ఐ.ఎమ్.ఏ.రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అతిధులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు.
ముఖ్య అతిథి డాక్టర్ విక్రమసింహా రెడ్డి మాట్లాడుతూ యూరాలజీ విభాగంలో గత దశాబ్ద కాలంలో అధునాతన వైద్య విధానాలు,పరికరాలు అందుబాటులోకి వచ్చాయని తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం వచ్చిందన్నారు.
దక్షిణ భారత యూరాలజీ సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ యూరాలజీలో కూడా కృత్రిమ మేధ వినియోగంతో అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలు చేయడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సంఘం అధ్యక్షులు డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ గతంలో నగరాలకే పరిమితమైన యూరాలజీ వైద్యం నేడు చిన్న పట్టణాలలో కూడా అందుబాటులోకి రావడం హర్షనీయమన్నారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్య సదస్సుల ద్వారా వైద్యులు వైద్యరంగంలో వస్తున్న నూతన విధానాలు, ఆధునిక మార్పులపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఉపయోగపడుతుందన్నారు.ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో పేద ప్రజలకు యూరాలజీ సేవలు అందుతున్నాయని గుర్తు చేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సంఘం( సోగస్) కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా కొనసాగుతున్నప్పటికీ యూరాలజీ సంఘం ఐక్యతతో కొనసాగుతూ వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ, రాష్ట్రస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల జిల్లాల యూరాలజీ సంఘాల సంయుక్త నిర్వహణలో నంద్యాలలో సదస్సు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు.
నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తనతో పాటు డాక్టర్ జై బాబు రెడ్డి ,డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ దాసరి రమేష్ ,నంద్యాల వైద్యుల సంఘం సహకారంతో నంద్యాలలో మొట్టమొదటిసారిగా సూపర్ స్పెషాలిటీ రాష్ట్రస్థాయి ఉభయ రాష్ట్రాల సదస్సు నిర్వహించడం నంద్యాలకు గర్వకారణం అన్నారు.నంద్యాలలో యూరాలజీ విభాగంలో మూత్రపిండాలు, మూత్రాశయ,మూత్ర నాళ,జననేంద్రియ జబ్బులకు అత్యంత ఆధునిక వైద్య వసతులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు
ఈ సందర్భంగా డాక్టర్ విక్రమసింహారెడ్డి ,డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ రవి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులుగా పాల్గొన్న డాక్టర్ పనిల్ కుమార్ లను నిర్వాహక కమిటీ ఘనంగా సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.