Thursday, 12 February 2026
  • Home  
  • వైజాగ్ లో జీవీఎంసీ చేపట్టిన ఆపరేషన్ లంగ్ వెనక అసలు రహస్యం ఏంటో తెలుసా? : ప్రియాంక దండి
- ఆంధ్రప్రదేశ్

వైజాగ్ లో జీవీఎంసీ చేపట్టిన ఆపరేషన్ లంగ్ వెనక అసలు రహస్యం ఏంటో తెలుసా? : ప్రియాంక దండి

విశాఖ నగరంలో ఉపాధి లేక చాలా మంది స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ లంగ్ కి ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోంది, కొంతమంది జీవీఎంసీ చర్యను సమర్థిస్తున్నారు, మరి కొందరు పేద ప్రజలను రోడ్డున పడేస్తున్నారు అని విమర్శస్తున్నారని, దీని వెనుక ఒక రహస్యం దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు. ఫుట్ కోర్టులు, వీధి వ్యాపారుల కారణంగా విశాఖలో ట్రాఫిక్ కష్టాలు చాలా ఎక్కువగా పెరిగిపోయింది, ఫుట్ పాత్ వ్యాపారులకు జీవీఎంసీ ప్రత్యేక జోన్లు కేటాయించకపోవడంతో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకొని వారు జీవనం సాగిస్తున్నారు, దీనికి కారణం జీవీఎంసీ అధికారుల పని తీరు సరిగ్గా లేకపోవడం. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం, ఫుట్ పాత్ వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయించి వారికి రక్షణ కల్పించాలి, జీవీఎంసీ అధికారులు ప్రత్యేక జోన్లు కేటాయించలేదు,కాని స్ట్రీట్ వెండర్ల దగ్గర పన్ను కట్టించుకున్నారు, ఆశీలు తీసుకున్నారు. జీవీఎంసీ అధికారులు ప్రజలకు, ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతోందన్న సాకుతో ముందోస్తూ సమాచారం లేకుండ ప్రత్యామయ ఏర్పాట్లు చేయకుండా బడ్డీలు, స్ట్రీట్ ఫుడ్ కోర్టులు ఆగ మేఘాల మీద తొలగిస్తున్నారు, జీవీఎంసీ అధికారులు చేపడుతున్న చర్యల వల్ల వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయాని ఆర్థికంగా చితికి పోతారని ఆమె అన్నారు. నగరాన్ని శుభ్రం చేయడానికి ఆపరేషన్ లంగ్ అని పైకి చెప్తున్న నగరానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి, ముఖ్యమంత్రి బంధువు తన సామాజికవర్గానికి చెందిన వారి హోటల్స్ కి ఈ ఫుడ్ కోర్ట్ ల వల్ల వ్యాపారం తగ్గిపోతోందని వారికి మేలు చేయడానికి ప్రజలకు అనుమానం రాకుండా ఆపరేషన్ లంగ్ పేరుతో ఫుడ్ కోర్టులతో పాటు నగరంలో అన్ని పాన్ షాపులను కూడ తొలగిస్తున్నారని ప్రియాంక విమర్శించారు. ఆ ప్రజా ప్రతినిధికి సామాన్యులన్న, పేద ప్రజలన్న పడదని గతంలో ఒక కార్యక్రమంలో మా సంస్థలో అందరు డబ్బు ఉన్నవారే చదువుతారని,ఇక్కడ పేదవాళ్లు ఎవరు లేరని, పేద వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతారని ఆయన వ్యాఖ్యలు చేసారు, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని ప్రియాంక విజ్ఞప్తి చేసారు.

విశాఖ నగరంలో ఉపాధి లేక చాలా మంది స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ లంగ్ కి ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోంది, కొంతమంది జీవీఎంసీ చర్యను సమర్థిస్తున్నారు, మరి కొందరు పేద ప్రజలను రోడ్డున పడేస్తున్నారు అని విమర్శస్తున్నారని, దీని వెనుక ఒక రహస్యం దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు. ఫుట్ కోర్టులు, వీధి వ్యాపారుల కారణంగా విశాఖలో ట్రాఫిక్ కష్టాలు చాలా ఎక్కువగా పెరిగిపోయింది, ఫుట్ పాత్ వ్యాపారులకు జీవీఎంసీ ప్రత్యేక జోన్లు కేటాయించకపోవడంతో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకొని వారు జీవనం సాగిస్తున్నారు, దీనికి కారణం జీవీఎంసీ అధికారుల పని తీరు సరిగ్గా లేకపోవడం. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం, ఫుట్ పాత్ వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయించి వారికి రక్షణ కల్పించాలి, జీవీఎంసీ అధికారులు ప్రత్యేక జోన్లు కేటాయించలేదు,కాని స్ట్రీట్ వెండర్ల దగ్గర పన్ను కట్టించుకున్నారు, ఆశీలు తీసుకున్నారు. జీవీఎంసీ అధికారులు ప్రజలకు, ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతోందన్న సాకుతో ముందోస్తూ సమాచారం లేకుండ ప్రత్యామయ ఏర్పాట్లు చేయకుండా బడ్డీలు, స్ట్రీట్ ఫుడ్ కోర్టులు ఆగ మేఘాల మీద తొలగిస్తున్నారు, జీవీఎంసీ అధికారులు చేపడుతున్న చర్యల వల్ల వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయాని ఆర్థికంగా చితికి పోతారని ఆమె అన్నారు.

నగరాన్ని శుభ్రం చేయడానికి ఆపరేషన్ లంగ్ అని పైకి చెప్తున్న నగరానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి, ముఖ్యమంత్రి బంధువు తన సామాజికవర్గానికి చెందిన వారి హోటల్స్ కి ఈ ఫుడ్ కోర్ట్ ల వల్ల వ్యాపారం తగ్గిపోతోందని వారికి మేలు చేయడానికి ప్రజలకు అనుమానం రాకుండా ఆపరేషన్ లంగ్ పేరుతో ఫుడ్ కోర్టులతో పాటు నగరంలో అన్ని పాన్ షాపులను కూడ తొలగిస్తున్నారని ప్రియాంక విమర్శించారు. ఆ ప్రజా ప్రతినిధికి సామాన్యులన్న, పేద ప్రజలన్న పడదని గతంలో ఒక కార్యక్రమంలో మా సంస్థలో అందరు డబ్బు ఉన్నవారే చదువుతారని,ఇక్కడ పేదవాళ్లు ఎవరు లేరని, పేద వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతారని ఆయన వ్యాఖ్యలు చేసారు, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని ప్రియాంక విజ్ఞప్తి చేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.