విశాఖపట్నం, నవంబర్ (పున్నమి ప్రతినిధి)
నెవల్ డాక్‌యార్డ్ సమీపంలో ఉన్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంతెనను
బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఘనంగా ప్రారంభించారు.
దాదాపు 18 నెలల పాటు సాగిన వంతెన మరమ్మతు పనులు పూర్తి కావడంతో ఈ రోజు తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ — “ఈ వంతెన ప్రారంభంతో వైజాగ్ ప్రజలకు ప్రయాణం మరింత సులభం అవుతుంది. సమయం ఆదా అవుతుంది. ఇంతకాలం ఎదురుచూసిన ప్రజల సంతోషమే నాకు నిజమైన ఆనందం” అని తెలిపారు.
వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.
వైజాగ్ అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే గణబాబు కృషికి నిదర్శనంగా ఈ వంతెన నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.


