కోట మండలానికి చెందిన సీనియర్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన నేపథ్యంలో తొలిసారిగా తన స్వగ్రామమైన అల్లంపాడుకు రావడంతో ఘన స్వాగతం లభించింది. వైసీపీ నాయకులు దువ్వూరు సాయిరెడ్డి, పాదర్తి రాధాకృష్ష్ణారెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డిల ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. కోట మండలం విద్యానగర్ నుండి కోట పట్టణం మీదుగా అల్లంపాడు వరకు 100 బైక్ లు, 50 కార్లతో భారీ ర్యాలీతో నిర్వహించారు. మార్గమధ్యలో గాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీ రాములు వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కోట పట్టణంలోకి శ్యాంప్రసాద్ రెడ్డి ఎంట్రీతో సందడి వాతావరణం కనిపించింది. మహిళలు హరతులు పట్టి టెంకాయలు కొట్టి స్వాగతం పలికారు. దారి పొడవునా బాణాసంచా కాల్చుతూ పూల వర్షం కురిపిస్తూ తీన్మార్ బ్యాండ్ శబ్ధాలతో.. గజమాలలు వేసి తమ అభిమానం చాటుకున్నారు. ఘనంగా సత్కరించిన వందలాది వైసీపీ శ్రేణులు, పేర్నాటి సైన్యం నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ అధినాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2019-2024 సంవత్సరకాలం పేద బడుగు బలహీన వర్గాలకు స్వర్ణయుగంలా సాగిందని గుర్తుచేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలం నుండి వైయస్సార్ సీపీ నాయకులను నామరూపం లేకుండా చేయాలని దురుద్దేశ్యంతో పాలన సాగిస్తోందని అన్నారు. చేయని తప్పులకు, తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని అన్నారు. తామంతా సమిష్టిగా వైసీపీ శ్రేణులకు అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు.. ‘జోహార్ వైయస్సార్!, జై జగన్.. జై జై జగన్.!, శ్యామన్న నాయకత్వం వర్ధిల్లాలి!’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, ఆయన సతీమణి హేమా సుష్మిత రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా పనిచేసారు. ఆ సమయంలో శ్యాంప్రసాద్ రెడ్డి కోట మండలానికి వచ్చిన సందర్భాల్లో ఆయన కాన్వాయ్ వెంట భారీ వాహనశ్రేణి ఉండేది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తాజాగా మంగళవారం శ్యాంప్రసాద్ రెడ్డి 100 బైక్ లు, 50 కార్లు, వందలాది అభిమానులు వెంట రాగా భారీ ర్యాలీతో కోట మండలంలోకి ప్రవేశించడంతో శ్యాంప్రసాద్ రెడ్డి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని పలువురు చర్చించుకున్నారు.
ఈ కార్యక్రమంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, సునీల్ రెడ్డి, పాముల సురేంద్ర, ఇన్నమాల వెంకటాద్రి, నర్రమాల రమణయ్య, షేక్ బాష, షేక్ మొయిన్ బాష, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు.


