వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్
ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 29(పున్నమి ప్రతినిధి)
గోనెగండ్ల పరిధిలోని కులుమలలో కలెక్టర్ డాక్టర్ సిరి పర్యటించారు.జాతీయ ఆహార నూనె గింజల పథకం ద్వారా రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం వారి వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.రైతులకు ఉచితంగా 150 క్వింటాళ్ల వేరుశనగ ప్యాకెట్లను అందిస్తున్నట్లు తెలిపారు.


