పున్నమి ప్రతి నిధి
కర్నూలు జిల్లాలో జరిగిన వీకావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వాలిడ్ పర్మిట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. యాజమాన్యం తెలిపిన ప్రకారం, వేగం కారణంగా కాకుండా, అగ్ని ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు పరిపూర్ణ సహాయం అందిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది.


