Sunday, 22 March 2026
  • Home  
  • వేములపల్లిలో పీఏసీఎస్ చైర్మన్‌గా ముక్కపాటి నరసింహారావు ప్రమాణ స్వీకారం
- ఎన్ టి ఆర్ జిల్లా

వేములపల్లిలో పీఏసీఎస్ చైర్మన్‌గా ముక్కపాటి నరసింహారావు ప్రమాణ స్వీకారం

కంచికచర్ల మండలం, వేములపల్లి: కంచికచర్ల మండలంలోని వేములపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కొత్త చైర్మన్‌గా ముక్కపాటి నరసింహారావు సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథు లుగా ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, “రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో సహకార సంఘాల పాత్ర అత్యంత కీలకం,” అని పేర్కొన్నారు. రైతులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి నూతన చైర్మన్ కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, “వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకు తరఫున అన్ని విధాల సహకారం అందిస్తాం,” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, రైతు నాయకులు, సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

కంచికచర్ల మండలం, వేములపల్లి: కంచికచర్ల మండలంలోని వేములపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కొత్త చైర్మన్‌గా ముక్కపాటి నరసింహారావు సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథు లుగా ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, “రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో సహకార సంఘాల పాత్ర అత్యంత కీలకం,” అని పేర్కొన్నారు. రైతులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి నూతన చైర్మన్ కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, “వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకు తరఫున అన్ని విధాల సహకారం అందిస్తాం,” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, రైతు నాయకులు, సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.