ఉత్తరాంధ్ర ప్రతినిధి నవంబర్ 13
(దేవరాపల్లి)
దేవరాపల్లి మండలం దేవరాపల్లి లో గురువారం టెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షులు, ఇతర పదవిదారుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం కిలపర్తి భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించగా, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని గ్రామాల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, యూనిట్ ఇన్‌చార్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. వేచలం గ్రామానికి టిడిపి అధ్యక్షునిగా రెడ్డి మల్లు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, సభా ప్రాంగణం జైజై అర్సతనాలతో మార్మోగింది.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గ్రామాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డి మల్లు నాయుడుకు పలువురు నాయకులు, అభిమానులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.


