Sunday, 29 March 2026
  • Home  
  • వేగంగా పెరుగుతున్న భద్రాచలం వద్ద గోదావరి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వేగంగా పెరుగుతున్న భద్రాచలం వద్ద గోదావరి

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బుధవారం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం.. ఈరోజు ఉదయం నుంచి వేగంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 37 అడుగుల వరకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల ఇంకా నీటిమట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జలాశయంలోని 24 గేట్లు వదిలి 57 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. వరద కారణంగా శబరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం భారీగా పెరగడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బుధవారం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం.. ఈరోజు ఉదయం నుంచి వేగంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 37 అడుగుల వరకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల ఇంకా నీటిమట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జలాశయంలోని 24 గేట్లు వదిలి 57 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. వరద కారణంగా శబరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం భారీగా పెరగడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.