Thursday, 26 March 2026
  • Home  
  • వేంపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల సమస్యపై నిరసన – డీపీఓతో చర్చించిన తులసి రెడ్డి, ధ్రువ కుమార్ రెడ్డి
- E-పేపర్

వేంపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల సమస్యపై నిరసన – డీపీఓతో చర్చించిన తులసి రెడ్డి, ధ్రువ కుమార్ రెడ్డి

వేంపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై సోమవారం రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి గారు, పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి గారు పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ సిబ్బందితో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. గత ఆరు నెలలుగా వేంపల్లి గ్రామ పంచాయతీకి రెగ్యులర్ ఈవో లేకపోవడం, పారిశుద్ధ్య మరియు మంచినీటి సరఫరా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా సిబ్బంది సమ్మె చేపట్టడంతో పంచాయతీ ప్రాంతం మురికి కూపంగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి గారు, డీఎల్ పీఓ రమాదేవి గారు వేంపల్లెకు వచ్చి సిబ్బంది, నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిబ్బందికి జీతాలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి గారు, ధ్రువ కుమార్ రెడ్డి గారు గ్రామ సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

వేంపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై సోమవారం రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి గారు, పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి గారు పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ సిబ్బందితో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
గత ఆరు నెలలుగా వేంపల్లి గ్రామ పంచాయతీకి రెగ్యులర్ ఈవో లేకపోవడం, పారిశుద్ధ్య మరియు మంచినీటి సరఫరా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా సిబ్బంది సమ్మె చేపట్టడంతో పంచాయతీ ప్రాంతం మురికి కూపంగా మారింది.
ఈ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి గారు, డీఎల్ పీఓ రమాదేవి గారు వేంపల్లెకు వచ్చి సిబ్బంది, నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిబ్బందికి జీతాలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి గారు, ధ్రువ కుమార్ రెడ్డి గారు గ్రామ సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.