Monday, 30 March 2026
  • Home  
  • వెల్లంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతుకు గిట్టుబాటు – పారదర్శక కొనుగోళ్లే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
- ఎన్ టి ఆర్ జిల్లా

వెల్లంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతుకు గిట్టుబాటు – పారదర్శక కొనుగోళ్లే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతీ గింజకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వమే ముందుండి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటను విక్రయించేందుకు కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. తూకం ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసేలా అధికారు లను ఆదేశించినట్లు తెలిపారు. రైతుల హక్కులను కాపాడటం, గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని సౌమ్య పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని, త్వరలో మరిన్ని పథకాలు అమలు కానున్నాయని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల ప్రజాప్రతి నిధులు, పిఏసీఎస్ చైర్మన్లు, కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతీ గింజకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వమే ముందుండి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటను విక్రయించేందుకు కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. తూకం ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసేలా అధికారు లను ఆదేశించినట్లు తెలిపారు.
రైతుల హక్కులను కాపాడటం, గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని సౌమ్య పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని, త్వరలో మరిన్ని పథకాలు అమలు కానున్నాయని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల ప్రజాప్రతి నిధులు, పిఏసీఎస్ చైర్మన్లు, కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.