*వెలుగుమట్ల భూ బాధితులకు అండగా కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష*
-దీక్షకు సంఘీభావం తెలిపిన మల్లోజు శ్రీనివాస చారి
ఇబ్రహీంపట్నం మార్చ్ 12
ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో భూదాన్ భూ బాధితులకు మద్దతుగా అంబేడ్కర్ భవన్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్షకు రంగారెడ్డి జిల్లా,యాచారం మండలం,మాల్ గ్రామానికి చెందిన మల్లోజు శ్రీనివాస చారి సంఘీభావం తెలిపారు.డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి సోమవారం రాత్రి ఆమె దీక్ష ప్రారంభించిన విషయం విదితమే.ప్రభుత్వ చర్యల వల్ల సుమారు 600 ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేయబడగా దాదాపు 2 వేల మంది ఒక్కరాత్రిలోనే నిరాశ్రయులయ్యారని ఈ సందర్బంగా శ్రీనివాస చారి తెలిపారు.బాధితుల్లో అధికంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలే ఉన్నాయని పేర్కొన్నారు.ఈ నిరాహార దీక్షలో అమరవీరుల ఆశయ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొర్ర సాయి రామ్,తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి అజయ్,రవి కుమార్,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


