ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ ప్రాంతంలో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులు సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతం అంబేద్కర్ సెంటర్ వద్ద తలదాచుకుంటున్నారు. ఈ కష్టకాలంలో వారికి అండగా నిలుస్తూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోశాధికారి దేవకీ వాసుదేవరావు గత రెండు రోజులుగా నిర్వాసితులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. శుక్రవారం కూడా అయన ఆధ్వర్యంలో బాధితులకు ఆహారం అందజేసి వారి ఆకలి తీర్చే కార్యక్రమం నిర్వహించబడింది.
ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సహాయం వారికి తాత్కాలిక ఊరటనిస్తోంది. ఈ సేవా కార్యక్రమంలో బీజేపీ మరియు జనసేన నాయకులు వల్లల రమేష్, రుద్రగాని మాధవ, మిర్యాల రామకృష్ణ తదితరులు పాల్గొని బాధితులకు మద్దతు తెలిపారు.
నిర్వాసితుల పట్ల మానవత్వంతో ముందుకు వచ్చిన నేతలను బాధితులు కృతజ్ఞతలతో అభినందించారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. వెలుగుమట్ల ఘటనతో నిరాశ్రయులైన ప్రజలకు తక్షణ సహాయం అవసరమని నేతలు పేర్కొన్నారు.



