సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లో
నిర్మానుష్యంగా మారి 500 మీటర్లు సముద్రం వెనక్కి వెళ్లడంతో ఆందోళన చెందుతున్న స్థానికులు.
అంతర్వేది తీర ప్రాంతమంతా మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టితో నిండి పోవడంతో సముద్రం స్నానానికి వెళ్లాలంటేనే భయపడిపోతున్న పర్యాటకులు, భక్తులు.
మునుపెన్నడు ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని సునామి వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్న గ్రామస్తులు…
ఎడారిని తలపించే విధంగా సముద్రం విశాలంగా వెనక్కి వెళ్లిపోవడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో స్థానికులు..
గతంలోనూ ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్లిన సముద్రం…
ఇప్పుడు ఒండ్రు మట్టి ముందుకు వచ్చి సముద్ర వెనక్కి వెళ్లడంతో భయాందోళనలో చుట్టుపక్కల గ్రామస్తులు.


