అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధ దంపతుల సమస్యకు పరిష్కారం లభించింది. మదనపల్లె నుంచి తన కొడుకుని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన దంపతులను సిబ్బంది రెండు రోజులుగా అడ్మిట్ చేయకపోవడంతో, వారు ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అన్నమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వరి కి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఈశ్వరి వెంటనే ఆసుపత్రికి చేరుకుని సిబ్బందితో మాట్లాడి రోగిని అడ్మిట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. తక్షణ స్పందనతో వృద్ధ దంపతులు ఈశ్వరి కు ధన్యవాదాలు తెలిపారు.
ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఎదురైతే, వెంటనే తెలియజేయాలని, తాను తక్షణమే స్పందిస్తానని వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వరి తెలిపారు.

వృద్ధ దంపతుల సమస్య పరిష్కరించిన కన్జ్యూమర్ ఫోరం నేత ఈశ్వరి
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధ దంపతుల సమస్యకు పరిష్కారం లభించింది. మదనపల్లె నుంచి తన కొడుకుని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన దంపతులను సిబ్బంది రెండు రోజులుగా అడ్మిట్ చేయకపోవడంతో, వారు ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అన్నమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వరి కి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఈశ్వరి వెంటనే ఆసుపత్రికి చేరుకుని సిబ్బందితో మాట్లాడి రోగిని అడ్మిట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. తక్షణ స్పందనతో వృద్ధ దంపతులు ఈశ్వరి కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఎదురైతే, వెంటనే తెలియజేయాలని, తాను తక్షణమే స్పందిస్తానని వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వరి తెలిపారు.

