ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పేడు మండలం, వికృత గ్రామంలోని ఆదర్శ వృద్ధాశ్రమంలో ‘స్వేచ్ఛ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో వినూత్న సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ పూట వృద్ధులకు, వికలాంగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫౌండేషన్ వాలంటీర్ల చొరవతో శుక్రవారం ఉదయం ఆశ్రమ నివాసితులకు రుచికరమైన అల్పాహారాన్ని పంపిణీ చేశారు. స్వయంగా ఫౌండేషన్ సభ్యులే వృద్ధుల వద్దకు వెళ్లి అల్పాహారాన్ని వడ్డించి, వారితో సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా స్వేచ్ఛ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ యాదవ్ మాట్లాడుతూ.. పండుగ వేళ వృద్ధులు మరియు వికలాంగుల మధ్య సమయాన్ని గడపడం, వారికి స్వల్ప సాయం అందించడం తమకు ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, వాలంటీర్ల సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. తమను అక్కున చేర్చుకుని, పండుగ పూట ఆత్మీయతను పంచిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులకు ఆశ్రమ నిర్వాహకులు మరియు వృద్ధులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు.

వృద్ధాశ్రమంలో శ్రీరామ నవమి వేడుకలు-అల్పాహారం పంపిణీ చేసిన ‘స్వేచ్ఛ ఫౌండేషన్’.