వృత్తి జీవితం – 2
పనివేళలో అదనపు గంట ( 1 )
నిన్న మనం ఒక డైలమాని విశ్లేషించాం. మన కంపెని యజమాని / డైరక్టర్‌తో కలిసి ఒక ప్రాజక్టు విూద పని చేసే అవకాశంవచ్చినప్పుడు, మన పని వేళలో అదనపు గంటనిఎలా వెతికిపట్టుకోవాలి? అనే విషయం? ఈ సంచికలో అది మరింత విపులంగా.
ఇలాంటి కష్టమైన నిర్ణయాలు తీసుకునే సందర్భాలు మన వృత్తి జీవితంలో ఎన్నోవస్తూ ఉంటాయి. ఏదో ఒక అదనపు బాధ్యత వచ్చి పడుతుంది. అది గనక వదులుకుంటే, మళ్ళీ రాదు, రిటైర్మెంటు అయ్యే వరకు గ్రౌండ్ లెవెల్ సిపాయి ఉద్యోగమే చెయ్యాలి. ఒప్పుకుంటే, ఒక్క సంవత్సర కాలంలో చాలా గుర్తింపు, పైకి వెళ్ళే అవకాశం. కానీ దాని కోసం చాలా వదులుకోవాలా? వీటికి ఒక పరిష్కారం మన టైం మేనేజిమెంటులో ఉంటుంది. ఇలాంటి అవకాశాలు విూ తలుపు తట్టినప్పుడు, విూకు ఈ సూచనలు ఉపయోగపడవచ్చు.
(1) మొట్ట మొదటగా ‘రేపు చేయవలసిన పనుల చెక్ లిస్ట్’ రాసుకోవడం. ఉదాహరణకి విూ ఆఫీసు 6 గంటలకి అయిపోతుంది అనుకోండి. ఒక 10 నిముషాల ముందు, అన్నీ కట్టేసి, అస్త్ర సన్యాసం చేసి, ఇంటికి వెళ్ళడానికి మూటా ముల్లే సర్దుకుని, ఒక కాగితం పైన, లేదా ఒక డేట్లు ఉన్న డైరీలో, రేపు చేయవలసిన లిస్ట్ రాసుకోండి. ఏమేమి పనులు చెయ్యాలి? ఏయే రిపోర్టులు ఎవరెవరికి పంపాలి? ఎవరెవరికి ఫోన్ చేసి ఫాలో అప్ చెయ్యాలి? వగైరాలు. ఒక సారి మన మనసులో నుంచి పేపర్ విూద రాస్తే, మనసు ప్రశాంతం అయిపోతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు రేపటి గురించి ఇబ్బందిపడము. రేపు ఆఫీసుకి వచ్చాక, మన చెక్‌లిస్ట్ ఫాలో అయిపోతాము. మన పనికి ఒక రిథం, ఒక ఫ్లో వస్తాయి.
(2) రాసుకుని పూర్తి చేసిన పనుల విూద ‘టిక్ మార్కు’ పెట్టడం. టిక్ మార్కు లేనివి మళ్ళీ రేపటికి. ఇలా ఎక్కువ రాసుకోవడం, తక్కువ చెయ్యడం ఎందుకు అవుతుందంటే, ఏ పనికి ఎంత సమయం పడుతుంది అనే విశ్లేషణ లేనప్పుడు. మన బాల్యంలో స్కూలులో ‘కాలము -పని’ లెక్కలు చేశాము గుర్తు ఉందా? దానిని మళ్ళీ తిరగదోడాలి!
(3) ఇక 3వ పాయింటు. మన దైనందిక పని జీవితంలో ‘టైం వేస్ట్ వ్యవహారాలు’ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని, వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగించడం. వీటిలో ముఖ్యమైనవి. పని సమయంలో ఫేస్‌బుక్ అప్ డేట్‌లు, వాట్సాప్ ఫార్వర్డ్‌లు, చాటింగులు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుని (అదీ ఆఫీస్ వై-ఫైతో!) చూడడం, ఫార్వర్డ్ చెయ్యడం, అనవసరమైన విూటింగులు, మధ్యలో ఫోన్ కాల్స్‌లాంటి ఆటంకాలు, ఎక్కడో పెట్టి మరిచిపోయిన ఫైల్స్‌ని వెతుక్కో వడం, ఇలా వీటిని తొలగిస్తే రోజుకు గంటన్నర మిగులుతుంది.
(4) మనం కేవలం ప్రేక్షక పాత్ర వహించే ఆఫీస్ విూటింగుల నుంచి మనని తప్పించమని మనపై అధికారులని రెక్వెస్ట్ చేయడం. ఈ టైంలో ‘బిగ్‌బాస్ ప్రాజక్టు విూద ఉన్నారు కాబట్టి విూపై బాస్ విూ అభ్యర్ధన వింటారు!
(5) ఈ చివరి సూచన ఇతర స¬ద్యోగుల సలహా అడగడం వారిని అడగవలసిన ప్రశ్నలు. (1) నాకు ఏయే పనులలో టైం వేష్టు అవుతోంది? (2) ఏయే పనులను నేను తరచుగా చేయడం తగ్గించాలి? (3) ఏ పనులు, నేను మరింత తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు? (ఉదాహరణకి, ఆఫీసు
విూటింగులు. (4) ఏయే పనులను నేను పూర్తిగా మానేయవచ్చు?
మనం ఊహించని జవాబులు వచ్చి, మనని కుదిపేస్తాయి !
సంస్థలో అదనపు బాధ్యతని ఒక భారంగా కాక, విలువైన అవకాశంగా భావించండి. చేసే 8 గంటలలోనే, దాగి ఉన్న అదనపు గంటని కనుక్కుని, విూ ఉత్పాదక శక్తిని పెంచుకోండి. వృత్తి జీవితంలో మరిన్ని మెట్లు అధిరోహించండి.

వృత్తి జీవితం – 2 పనివేళలో అదనపు గంట ( 1 ) నిన్న మనం ఒక డైలమాని విశ్లేషించాం. మన కంపెని యజమాని / డైరక్టర్‌తో కలిసి ఒక ప్రాజక్టు విూద పని చేసే అవకాశంవచ్చినప్పుడు, మన పని వేళలో అదనపు గంటనిఎలా వెతికిపట్టుకోవాలి? అనే విషయం? ఈ సంచికలో అది మరింత విపులంగా. ఇలాంటి కష్టమైన నిర్ణయాలు తీసుకునే సందర్భాలు మన వృత్తి జీవితంలో ఎన్నోవస్తూ ఉంటాయి. ఏదో ఒక అదనపు బాధ్యత వచ్చి పడుతుంది. అది గనక వదులుకుంటే, మళ్ళీ రాదు, రిటైర్మెంటు అయ్యే వరకు గ్రౌండ్ లెవెల్ సిపాయి ఉద్యోగమే చెయ్యాలి. ఒప్పుకుంటే, ఒక్క సంవత్సర కాలంలో చాలా గుర్తింపు, పైకి వెళ్ళే అవకాశం. కానీ దాని కోసం చాలా వదులుకోవాలా? వీటికి ఒక పరిష్కారం మన టైం మేనేజిమెంటులో ఉంటుంది. ఇలాంటి అవకాశాలు విూ తలుపు తట్టినప్పుడు, విూకు ఈ సూచనలు ఉపయోగపడవచ్చు. (1) మొట్ట మొదటగా ‘రేపు చేయవలసిన పనుల చెక్ లిస్ట్’ రాసుకోవడం. ఉదాహరణకి విూ ఆఫీసు 6 గంటలకి అయిపోతుంది అనుకోండి. ఒక 10 నిముషాల ముందు, అన్నీ కట్టేసి, అస్త్ర సన్యాసం చేసి, ఇంటికి వెళ్ళడానికి మూటా ముల్లే సర్దుకుని, ఒక కాగితం పైన, లేదా ఒక డేట్లు ఉన్న డైరీలో, రేపు చేయవలసిన లిస్ట్ రాసుకోండి. ఏమేమి పనులు చెయ్యాలి? ఏయే రిపోర్టులు ఎవరెవరికి పంపాలి? ఎవరెవరికి ఫోన్ చేసి ఫాలో అప్ చెయ్యాలి? వగైరాలు. ఒక సారి మన మనసులో నుంచి పేపర్ విూద రాస్తే, మనసు ప్రశాంతం అయిపోతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు రేపటి గురించి ఇబ్బందిపడము. రేపు ఆఫీసుకి వచ్చాక, మన చెక్‌లిస్ట్ ఫాలో అయిపోతాము. మన పనికి ఒక రిథం, ఒక ఫ్లో వస్తాయి. (2) రాసుకుని పూర్తి చేసిన పనుల విూద ‘టిక్ మార్కు’ పెట్టడం. టిక్ మార్కు లేనివి మళ్ళీ రేపటికి. ఇలా ఎక్కువ రాసుకోవడం, తక్కువ చెయ్యడం ఎందుకు అవుతుందంటే, ఏ పనికి ఎంత సమయం పడుతుంది అనే విశ్లేషణ లేనప్పుడు. మన బాల్యంలో స్కూలులో ‘కాలము -పని’ లెక్కలు చేశాము గుర్తు ఉందా? దానిని మళ్ళీ తిరగదోడాలి! (3) ఇక 3వ పాయింటు. మన దైనందిక పని జీవితంలో ‘టైం వేస్ట్ వ్యవహారాలు’ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని, వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగించడం. వీటిలో ముఖ్యమైనవి. పని సమయంలో ఫేస్‌బుక్ అప్ డేట్‌లు, వాట్సాప్ ఫార్వర్డ్‌లు, చాటింగులు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుని (అదీ ఆఫీస్ వై-ఫైతో!) చూడడం, ఫార్వర్డ్ చెయ్యడం, అనవసరమైన విూటింగులు, మధ్యలో ఫోన్ కాల్స్‌లాంటి ఆటంకాలు, ఎక్కడో పెట్టి మరిచిపోయిన ఫైల్స్‌ని వెతుక్కో వడం, ఇలా వీటిని తొలగిస్తే రోజుకు గంటన్నర మిగులుతుంది. (4) మనం కేవలం ప్రేక్షక పాత్ర వహించే ఆఫీస్ విూటింగుల నుంచి మనని తప్పించమని మనపై అధికారులని రెక్వెస్ట్ చేయడం. ఈ టైంలో ‘బిగ్‌బాస్ ప్రాజక్టు విూద ఉన్నారు కాబట్టి విూపై బాస్ విూ అభ్యర్ధన వింటారు! (5) ఈ చివరి సూచన ఇతర స¬ద్యోగుల సలహా అడగడం వారిని అడగవలసిన ప్రశ్నలు. (1) నాకు ఏయే పనులలో టైం వేష్టు అవుతోంది? (2) ఏయే పనులను నేను తరచుగా చేయడం తగ్గించాలి? (3) ఏ పనులు, నేను మరింత తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు? (ఉదాహరణకి, ఆఫీసు విూటింగులు. (4) ఏయే పనులను నేను పూర్తిగా మానేయవచ్చు? మనం ఊహించని జవాబులు వచ్చి, మనని కుదిపేస్తాయి ! సంస్థలో అదనపు బాధ్యతని ఒక భారంగా కాక, విలువైన అవకాశంగా భావించండి. చేసే 8 గంటలలోనే, దాగి ఉన్న అదనపు గంటని కనుక్కుని, విూ ఉత్పాదక శక్తిని పెంచుకోండి. వృత్తి జీవితంలో మరిన్ని మెట్లు అధిరోహించండి.

