తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
బాలా త్రిపుర సుందరి పీఠం వీరంపాలెంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కర్రి వెంకట రామకృష్ణారెడ్డి, స్వర్ణప్రద దంపతుల చేతుల ద్వారా కలశస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి దేవిగా అలంకరించి ప్రత్యేక అర్చనలు చేశారు. బ్రహ్మశ్రీ వెంకటరమణ శాస్త్రి, శరన్నవరాత్రులు అత్యంత ప్రాముఖ్యమైనవని, భక్తులు పది రోజుల పాటు పీఠ ఉత్సవాల్లో పాల్గొని అమ్మ దర్శనాన్ని పొందాలని సూచించారు. గ్రామ మహిళా భక్తులు 108 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులకు అన్నప్రసాదం కూడా పంపిణీ చేయబడింది.


