విశాఖపట్నం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
సౌత్ జైల్ రోడ్డులో షాపులు తొలగించడంపై వ్యాపారులు నిరసనలు తెలిపారు. Street Vendors Act, 2014 ప్రకారం వ్యాపారులకు Certificate of Vending, PM SVANidhi రుణాలు, సామాజిక భద్రత హక్కులు ఉన్నాయి. వీధి వ్యాపారులు శుభ్రత పాటించాలి, ఫుట్‌పాత్ ఆక్రమించకూడదు.మధ్యవర్తులు అధిక వసూలు చేసి లైసెన్స్ ఇవ్వకపోవడం, జీవీఎంసీ, సంబంధిత మంత్రుల బాధ్యతలపై బొలిశెట్టి సత్య విమర్శించారు. 240+ షాపుల నుండి వసూలు చేసిన కోట్లు ఎవరు తీసారో బహిరంగ విచారణ, కోట్లు తిరిగి రాబట్టాలని సూచించారు. విజయవాడ #EatStreet మోడల్ అమలు చేసి పేదలకు ఉపాధి, వినియోగదారులకు శుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించాలని చెప్పారు.


