*వీధి దీపాలు మరమ్మత్తు … దగ్గరుండి చేయించిన టీడీపీ నాయకులు*
హర్షం వ్యక్తం చేసిన స్థానికులు..
పొదలకూరు పట్టణంలో వినాయక మాన్యం లో వీధి దీపాలు వెలగక పాదచారులు,వాహన దారులకు ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయాన్ని మండల నాయకులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణాధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు గార్లకు తెలియ జేయగా పంచాయతీ సిబ్బందికి తెలియ పరిచి వారి సమక్షంలో నాయకులు కలగట్ల సందీప్,డేగ హరి నారాయణ లు పంచాయతీ టెక్నీషియన్ ల సహాయంతో మరమ్మత్తులు చేయించారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


