కామారెడ్డి, 7 అక్టోబర్, పున్నమి ప్రతినిధి :
వీధి కుక్కల విహారం స్థానికుల్లో ఆందోళన కలిగి స్తుందని అంటున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామ కూడలిలో వీధి కుక్కల సమూహం రోడ్లపై స్వైర విహారం చేస్తూ ఉండటం స్థానికులను, రాకపోకలు సాగించేవారిని ఆందోళ నకు గురిచేస్తోంది.పగటిపూట ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతూ, అటుగా వెళ్లే ప్రజల ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.నేటి దృశ్యం లో, దాదాపు పదికి పైగా కుక్కలు ప్రధాన కూడలి లో గుమిగూడి ఉన్నట్లు స్పష్టంగా కనిపి స్తోంది. వీటిలో కొన్ని నలుపు, గోధుమ రంగులో ఉండగా, మరికొన్ని తెలుపు, నలుపు మచ్చలతో ఉన్నాయి. సాధారణంగా, ఈ కుక్కల సమూహాలు చిన్న పిల్లలపై, ద్విచక్ర వాహనదారులపై అకస్మాత్తు గా దాడి చేసే ప్రమాదం ఉందంటున్నారు.స్థానికులు, కుక్కలు ఎక్కువగా తిరగడం వల్ల మేము పిల్లలను ఒంటరిగా బయటికి పంపాలంటే భయ పడుతు న్నాం అని స్థానిక నివాసి ఒకరు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ కుక్కలు అధికంగా కనిపిస్తున్నాయి వాటిని చూస్తే భయం దోళనకు గురౌతున్నామని అంటున్నారు. సంబం ధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, ఈ కుక్కల బెడదను నివారించాలని కోరుకుంటున్నా రు., అని వారు విజ్ఞప్తి చేశారు.అధికారులు ఈ వీధి కుక్కల సమస్యపై అధికారులు తక్షణమే దృష్టి సారించి, వాటిని నియంత్రించడానికి చర్యలు చేప ట్టాలని అన్నారు. తద్వారా స్థానిక ప్రజలకు సురక్షి తమైన వాతావరణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


