వేతనాలు, ప్రమోషన్లు, అదనపు పనుల భారం వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిట్వేల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల వీఆర్ఏలు గౌరవ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ, పని భారం ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో పోరాడి సాధించుకున్న డి.ఎ 300 రూపాయలను కూడా రికవరీ చేయడం వీఆర్ఏలపై భారమయ్యిందని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా వేతనాలు పెరగకపోవడం, వీఆర్ఏల అనేక సమస్యలు పెండింగ్‌లో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నైట్‌డ్యూటీలు, రీసర్వే వంటి అదనపు పనులు చేయించుకుంటూ రెవెన్యూ అధికారులు వీఆర్ఏలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. నెలకు వచ్చే రూ.10,500లోనే పెట్రోల్, భోజనం ఖర్చులు పెట్టి పని చేయాల్సి వస్తోందని చెప్పారు.
తెలంగాణ మాదిరి పే స్కేల్ అమలు చేయాలని, వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, డ్రైవర్ పోస్టులకు వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 20 శాతం ప్రమోషన్ కోటాను 70 శాతానికి పెంచాలని కోరారు. మదనపల్లి డివిజన్‌లో వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇచ్చి రాజంపేట డివిజన్‌లో అమలు చేయకపోవడం సరికాదన్నారు. సబ్‌కలెక్టర్ ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని గుర్తించారు. నామినీగా పనిచేస్తున్నవారిని రెగ్యులర్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.
వీఆర్ఏ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరముట్ల సుధాకర్ మాట్లాడుతూ, పార్ట్‌టైమ్ వేతనంతో ఫుల్‌టైమ్ పని చేయించడం అన్యాయమని, అదన పనులకు తగిన వేతనం ఇవ్వాలని కోరారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం, అర్హులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వడం అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంది కాళ్ల మణి, మల్లారపు గురయ్య, బి. సుబ్బరాయుడు, సంగటి, శంకర్, జె. రమణ, జి. నరేష్, మదన్ మోహన్, రామయ్య, పి. సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
తరువాత సంఘ ప్రతినిధులు తహసీల్దార్ స్పందనకు వినతి పత్రం అందజేశారు.

వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ చిట్వేల్‌లో ధర్నా
వేతనాలు, ప్రమోషన్లు, అదనపు పనుల భారం వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిట్వేల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల వీఆర్ఏలు గౌరవ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ, పని భారం ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో పోరాడి సాధించుకున్న డి.ఎ 300 రూపాయలను కూడా రికవరీ చేయడం వీఆర్ఏలపై భారమయ్యిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా వేతనాలు పెరగకపోవడం, వీఆర్ఏల అనేక సమస్యలు పెండింగ్‌లో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నైట్‌డ్యూటీలు, రీసర్వే వంటి అదనపు పనులు చేయించుకుంటూ రెవెన్యూ అధికారులు వీఆర్ఏలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. నెలకు వచ్చే రూ.10,500లోనే పెట్రోల్, భోజనం ఖర్చులు పెట్టి పని చేయాల్సి వస్తోందని చెప్పారు. తెలంగాణ మాదిరి పే స్కేల్ అమలు చేయాలని, వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, డ్రైవర్ పోస్టులకు వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 20 శాతం ప్రమోషన్ కోటాను 70 శాతానికి పెంచాలని కోరారు. మదనపల్లి డివిజన్‌లో వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇచ్చి రాజంపేట డివిజన్‌లో అమలు చేయకపోవడం సరికాదన్నారు. సబ్‌కలెక్టర్ ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని గుర్తించారు. నామినీగా పనిచేస్తున్నవారిని రెగ్యులర్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. వీఆర్ఏ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరముట్ల సుధాకర్ మాట్లాడుతూ, పార్ట్‌టైమ్ వేతనంతో ఫుల్‌టైమ్ పని చేయించడం అన్యాయమని, అదన పనులకు తగిన వేతనం ఇవ్వాలని కోరారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం, అర్హులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంది కాళ్ల మణి, మల్లారపు గురయ్య, బి. సుబ్బరాయుడు, సంగటి, శంకర్, జె. రమణ, జి. నరేష్, మదన్ మోహన్, రామయ్య, పి. సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. తరువాత సంఘ ప్రతినిధులు తహసీల్దార్ స్పందనకు వినతి పత్రం అందజేశారు.

