అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపం లోని 44 జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వికేర్ సీడ్స్ వ్యవసాయ ప్రైవేట్ ప్రాసెసింగ్ కేంద్రంలో ఐటీ సోదాలు.. రాష్ట్రంలోని పప్పు దినుసులు, హోల్సేల్, వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ దాడుల నేపథ్యంలో ఉండవల్లి సమీపంలోని వి.కేర్ సీడ్స్ కంపెనీలో పప్పు దినుసులపై పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా ఐటీ అధికారులు సోదాలు. సంస్థ యజమానులు సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ అధికారులు కోల్డ్ స్టోరేజ్, సమీపంలో ఉన్న ఇతర వాహనాల్లో సోదాలు చేశారు. ఈ కంపెనీ రైతుల పేరుతో పంటలను కొనుగోలు చేసి స్టోరేజ్లో దాయడంతో పాటు రైతుల పేరుతోనే క్రయవిక్రయాలు చేస్తూ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగం కొన్నేళ్లుగా సాగుతుండగా ఏపీ ఐటీ అధికారులు నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

వి కేర్ కోల్డ్ స్టోరేజీపై ఐటీ అధికారులు
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపం లోని 44 జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వికేర్ సీడ్స్ వ్యవసాయ ప్రైవేట్ ప్రాసెసింగ్ కేంద్రంలో ఐటీ సోదాలు.. రాష్ట్రంలోని పప్పు దినుసులు, హోల్సేల్, వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ దాడుల నేపథ్యంలో ఉండవల్లి సమీపంలోని వి.కేర్ సీడ్స్ కంపెనీలో పప్పు దినుసులపై పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా ఐటీ అధికారులు సోదాలు. సంస్థ యజమానులు సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ అధికారులు కోల్డ్ స్టోరేజ్, సమీపంలో ఉన్న ఇతర వాహనాల్లో సోదాలు చేశారు. ఈ కంపెనీ రైతుల పేరుతో పంటలను కొనుగోలు చేసి స్టోరేజ్లో దాయడంతో పాటు రైతుల పేరుతోనే క్రయవిక్రయాలు చేస్తూ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగం కొన్నేళ్లుగా సాగుతుండగా ఏపీ ఐటీ అధికారులు నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

