మొక్కలు నాటిన లయనిజం (శ్రీకాకుళం – )


గాంధీ మందిర స్మృతివనంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహంకు పూలమాలలు వేసి, అంజలి ఘటించి, ప్రసంగించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం, లయన్స్ క్లబ్ హర్షవల్లి సంయుక్తంగా నిర్వహించిన వేడుకలలో ఇంజినీర్ బృందానికి సత్కరించిన అనంతరం లయన్ సింధూర, లయన్ బరాటం లక్ష్మణ రావు, లయన్ హారికాప్రసాద్, లయన్ వి. జగన్నాధం తదితరులు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత సత్యాలను వివరించారు. ఇందులో భాగముగా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవి కుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు బాధ్యతవహించి స్మృతివనంలో మొక్కలను నాటి, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ గా బాధ్యతలను చేపట్టిన పొన్నాడ. రవి కుమార్ కు అభినందనల ప్రశంసల జల్లులు కురిపించారు. సత్కరించిన ఇంజనీర్ లు బి.రమేష్, బి. సత్యన్నారాయణ, వి. శ్రీనివాస్ రావు, డి.కామేశ్వర రావు తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం. రామ్ గోపాల్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం, లయన్స్ క్లబ్ హర్షవల్లి సభ్యులబృందం పాల్గొన్నారు.

