Sunday, 7 December 2025
  • Home  
  • విశాఖ విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ అప్పలరాజు ఆకస్మిక మరణం… అశ్రు నివాళులర్పించిన బంధువులు, స్నేహితులు , విశాలాంధ్ర, అరసం, సిపిఐ శ్రేణులు
- విశాఖపట్నం

విశాఖ విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ అప్పలరాజు ఆకస్మిక మరణం… అశ్రు నివాళులర్పించిన బంధువులు, స్నేహితులు , విశాలాంధ్ర, అరసం, సిపిఐ శ్రేణులు

విశాలాంధ్ర విశాఖ బుక్ హౌస్ మేనేజర్ పోలవరపు అప్పలరాజు మంగళవారం ఉదయం గుండెపోటు తో ఆకస్మిక మరణం పొందారు. బంధువులు, స్నేహితులు హుటాహుటిన కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారించడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు పరుగు పరుగున ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరై విలపించారు. పోలవరపు అప్పారావు , అప్పల నరసమ్మ దంపతులకు ఏకైక పుత్రుడు గా 1979 ఏప్రిల్ 20 లో పుట్టిన అప్పలరాజు కు భార్య కనకరత్నం, కుమారుడు వెంకట్ నీరజ్, ఐదుగురు అక్క చెల్లెలు వున్నారు. విశాఖ నగరంలో వన్ టౌన్, లక్ష్మీ టాకీస్ పద్మా నగర్ లో జన్మించిన రాజు , దినపత్రిక పేపర్ బోయగా చేరిన తర్వాత కాలంలో 1996 లో విశాలాంధ్ర బుక్ హౌస్ లో ప్యాకర్ గా చేరారు. యోగి మేనేజర్ ఉన్న గా కాలంలో రాజు బుక్ హౌస్ ఉద్యోగిగా చేరిన అంచంచలుగా ఎదుగుతూ శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్ గా , తర్వాత విశాఖపట్నం మేనేజర్ గానే కొనసాగారు. అరసం, సిపిఐ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అప్పలరాజు పార్థివ దేహానికి సిపిఐ నేతలు ఎర్రజెండాను కప్పి నివాళులర్పించారు. విశాలాంధ్ర తరపున విశాఖపట్నం బ్యూరో పి. రామక్రిష్ణ , ఎడిషన్ మేనేజర్ సనపల నరసింహులు, సర్కులేషన్ బాధ్యులు కిరణ్ తదితరులు ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అత్తిలి విమల, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం.మన్మధరావు, సిఎన్ క్షేత్రపాలరెడ్డి, ఎం.డి బేగం, జిల్లా సమితి సభ్యులు జె. అన్వేషి ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫణీంద్ర, నాగభూషణం, నాగరాజు ,అభిషేక్ , డిహెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్, విజయనగరం బుక్ హౌస్ మేనేజర్ ఇబ్రహీం, శ్రీకాకుళం బుక్ హౌస్ మేనేజర్ రవి, స్టాఫ్ నజీర్, మూర్తి, 39 వార్డు జనసేన అధ్యక్షులు, కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం తో పాటు వివిధ పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు, అధిక సంఖ్యలో మిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జోహార్ రాజు అంటూ ఘన నివాళులర్పించారు. అరసంవిశాఖ సంతాప సందేశం… అరసం విశాఖజిల్లాశాఖ కార్యవర్గసభ్యుడు విశాలాంధ్రమేనేజర్ పిఏరాజు హటాన్శరణం దిగ్బ్రాంతినికలిగించింది. రాజు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, అభ్యుదయ భావజాలంతో క్రమశిక్షణగలకార్యకర్తగా అరసంకార్యక్రమాలలో ఎంతోచురుగ్గా పాల్గొనే గొప్పసభ్యుణ్ణికోల్పోవడం తీరనిలోటు గా భావిస్తున్నామని తెలియజేశారు. విశాఖలో పుస్తకప్రదర్శనలు ఏర్పాటుచేసినపుడు ప్రతిరోజూ అరసం -ఇతరసాహిత్యసంస్థలను సమన్వయపరచి మంచిసాహితీసభలనునిర్వహించి విశాఖలోని సాహితీవేత్తలందరినీ ఓచోటచేరేలాచేయడంలో రాజు చురుగ్గా వ్యవహరించి రచయితలనూ – పాఠకులనూమఒప్పించిమెప్పించేవాడు నిజంగా అరసంవిశాఖకు బలమైనకార్యకర్తనుకోల్పోయినట్లైంది. రాజు మరణానికి రాజుమరణంపట్ల నగరంలోని రచయితలు డా.డివిసూర్యారావు, అడపారాక్రిష్ణ, పతివాడనాస్తిక్ , సిహెచ్ చినసూర్యనారాయణ, డా.బండిసత్యనారాయణ, డా మాటూరిశ్రీనివాస్ ,రాంప్రభు,ప్రజ్ఞానంద్ తమసంతాపాన్నితెలియజేసారు హైదరాబాద్ నుంచి మాజీయుపిఎస్సీ సభ్యులు ప్రొఫెసర్ కెఎస్ చలం , గుంటూరునుంచి అరసం రాష్ట ప్రధాన కార్యదర్శి వల్లూరుశివప్రసాద్ , మీడియాకార్యదర్శి ఏఎమ్ ఆర్ ఆనంద్ , జాతీయ అరసంఅధ్యక్షులు పెనుగొండలక్ష్శీనారాయణ , అనంతపురంనించి అరసం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెంచంద్ర శేఖర్ తమసంతాపాన్నితెలియజేసారు. అరసం విశాఖశాఖ ఉపాధ్యక్షుడు ఎస్ హనుమంతరావు, ప్రధానకార్యదర్శి ఉప్పల అప్పలరాజు, కార్యవర్గం పి శ్యామసుందర్, బసుపోతన, కెవిఎస్ మూర్తి, బొట్టఅప్పారావు, పల్లాజగదీశ్ , దితరులందరూ తమప్రగాఢసంతాపంప్రకటించారు రాజు కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.

విశాలాంధ్ర విశాఖ బుక్ హౌస్ మేనేజర్ పోలవరపు అప్పలరాజు మంగళవారం ఉదయం గుండెపోటు తో ఆకస్మిక మరణం పొందారు. బంధువులు, స్నేహితులు హుటాహుటిన కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారించడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు పరుగు పరుగున ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరై విలపించారు. పోలవరపు అప్పారావు , అప్పల నరసమ్మ దంపతులకు ఏకైక పుత్రుడు గా 1979 ఏప్రిల్ 20 లో పుట్టిన అప్పలరాజు కు భార్య కనకరత్నం, కుమారుడు వెంకట్ నీరజ్, ఐదుగురు అక్క చెల్లెలు వున్నారు. విశాఖ నగరంలో వన్ టౌన్, లక్ష్మీ టాకీస్ పద్మా నగర్ లో జన్మించిన రాజు , దినపత్రిక పేపర్ బోయగా చేరిన తర్వాత కాలంలో 1996 లో విశాలాంధ్ర బుక్ హౌస్ లో ప్యాకర్ గా చేరారు.
యోగి మేనేజర్ ఉన్న గా కాలంలో రాజు బుక్ హౌస్ ఉద్యోగిగా చేరిన అంచంచలుగా ఎదుగుతూ శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్ గా , తర్వాత విశాఖపట్నం మేనేజర్ గానే కొనసాగారు. అరసం, సిపిఐ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అప్పలరాజు పార్థివ దేహానికి సిపిఐ నేతలు ఎర్రజెండాను కప్పి నివాళులర్పించారు.
విశాలాంధ్ర తరపున విశాఖపట్నం బ్యూరో పి. రామక్రిష్ణ , ఎడిషన్ మేనేజర్ సనపల నరసింహులు, సర్కులేషన్ బాధ్యులు కిరణ్ తదితరులు ఘన నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అత్తిలి విమల, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం.మన్మధరావు, సిఎన్ క్షేత్రపాలరెడ్డి, ఎం.డి బేగం, జిల్లా సమితి సభ్యులు జె. అన్వేషి ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫణీంద్ర, నాగభూషణం, నాగరాజు ,అభిషేక్ , డిహెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్, విజయనగరం బుక్ హౌస్ మేనేజర్ ఇబ్రహీం, శ్రీకాకుళం బుక్ హౌస్ మేనేజర్ రవి, స్టాఫ్ నజీర్, మూర్తి, 39 వార్డు జనసేన అధ్యక్షులు, కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం తో పాటు వివిధ పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు, అధిక సంఖ్యలో మిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జోహార్ రాజు అంటూ ఘన నివాళులర్పించారు.

అరసంవిశాఖ
సంతాప సందేశం…

అరసం విశాఖజిల్లాశాఖ కార్యవర్గసభ్యుడు విశాలాంధ్రమేనేజర్ పిఏరాజు హటాన్శరణం దిగ్బ్రాంతినికలిగించింది. రాజు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, అభ్యుదయ భావజాలంతో క్రమశిక్షణగలకార్యకర్తగా అరసంకార్యక్రమాలలో ఎంతోచురుగ్గా పాల్గొనే గొప్పసభ్యుణ్ణికోల్పోవడం తీరనిలోటు గా భావిస్తున్నామని తెలియజేశారు.
విశాఖలో పుస్తకప్రదర్శనలు ఏర్పాటుచేసినపుడు ప్రతిరోజూ అరసం -ఇతరసాహిత్యసంస్థలను సమన్వయపరచి మంచిసాహితీసభలనునిర్వహించి విశాఖలోని సాహితీవేత్తలందరినీ ఓచోటచేరేలాచేయడంలో రాజు చురుగ్గా వ్యవహరించి రచయితలనూ – పాఠకులనూమఒప్పించిమెప్పించేవాడు నిజంగా అరసంవిశాఖకు బలమైనకార్యకర్తనుకోల్పోయినట్లైంది. రాజు మరణానికి రాజుమరణంపట్ల నగరంలోని రచయితలు డా.డివిసూర్యారావు, అడపారాక్రిష్ణ, పతివాడనాస్తిక్ , సిహెచ్ చినసూర్యనారాయణ, డా.బండిసత్యనారాయణ, డా మాటూరిశ్రీనివాస్ ,రాంప్రభు,ప్రజ్ఞానంద్ తమసంతాపాన్నితెలియజేసారు
హైదరాబాద్ నుంచి మాజీయుపిఎస్సీ సభ్యులు ప్రొఫెసర్ కెఎస్ చలం , గుంటూరునుంచి అరసం రాష్ట ప్రధాన కార్యదర్శి వల్లూరుశివప్రసాద్ , మీడియాకార్యదర్శి ఏఎమ్ ఆర్ ఆనంద్ , జాతీయ అరసంఅధ్యక్షులు పెనుగొండలక్ష్శీనారాయణ , అనంతపురంనించి అరసం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెంచంద్ర శేఖర్ తమసంతాపాన్నితెలియజేసారు. అరసం విశాఖశాఖ ఉపాధ్యక్షుడు ఎస్ హనుమంతరావు, ప్రధానకార్యదర్శి ఉప్పల అప్పలరాజు, కార్యవర్గం పి శ్యామసుందర్, బసుపోతన, కెవిఎస్ మూర్తి, బొట్టఅప్పారావు, పల్లాజగదీశ్ , దితరులందరూ తమప్రగాఢసంతాపంప్రకటించారు రాజు కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.