Tuesday, 31 March 2026
  • Home  
  • విశాఖ లో టిడ్కో ఇళ్ల పంపిణీ 1393 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల పంపిణీ వైసీపీ నిర్లక్ష్యంపై పల్లా విమర్శలు
- విశాఖపట్నం

విశాఖ లో టిడ్కో ఇళ్ల పంపిణీ 1393 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల పంపిణీ వైసీపీ నిర్లక్ష్యంపై పల్లా విమర్శలు

విశాఖపట్నం, మార్చి (పున్నమి ప్రతినిధి) పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గాజువాక నియోజకవర్గం తలారువానిపాలెంలో టిడ్కో గృహ సముదాయాలను ఘనంగా ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇంచార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. గాజువాకలో మొత్తం 1393 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రెండో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల టిడ్కో ఇళ్లను అందజేస్తున్నామని తెలిపారు. గతంలో తొలి విడతలో 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయగా, మొత్తం 21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వ పనితీరు స్పష్టంగా చూపిస్తోందన్నారు.గత వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తయిన ఇళ్లను నిర్లక్ష్యం చేసి, రంగుల పేరుతో కోట్ల రూపాయలు వృథా చేసిందని ఆరోపించారు. మౌలిక వసతులు లేకుండా ఇళ్లను ఖాళీగా ఉంచడం వారి పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. లబ్ధిదారులను ఇళ్ల కోసం నిరీక్షింపజేసి తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెండింగ్ పనులను పూర్తి చేసి గృహాలకు జీవం పోసిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం–అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. Uploaded Video:

విశాఖపట్నం, మార్చి (పున్నమి ప్రతినిధి)

పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గాజువాక నియోజకవర్గం తలారువానిపాలెంలో టిడ్కో గృహ సముదాయాలను ఘనంగా ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇంచార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. గాజువాకలో మొత్తం 1393 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రెండో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల టిడ్కో ఇళ్లను అందజేస్తున్నామని తెలిపారు. గతంలో తొలి విడతలో 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయగా, మొత్తం 21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వ పనితీరు స్పష్టంగా చూపిస్తోందన్నారు.గత వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తయిన ఇళ్లను నిర్లక్ష్యం చేసి, రంగుల పేరుతో కోట్ల రూపాయలు వృథా చేసిందని ఆరోపించారు. మౌలిక వసతులు లేకుండా ఇళ్లను ఖాళీగా ఉంచడం వారి పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. లబ్ధిదారులను ఇళ్ల కోసం నిరీక్షింపజేసి తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెండింగ్ పనులను పూర్తి చేసి గృహాలకు జీవం పోసిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం–అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.