*విశాఖపట్నంఅక్టోబర్ పున్నమి ప్రతినిధి*
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో విశాఖ మెఘాద్రిగడ్డ రిజర్వాయర్‌లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఫలితంగా రిజర్వాయర్ పూర్తిస్థాయికి చేరువ కావడంతో అధికారులు మంగళవారం జాగ్రత్త చర్యగా నాలుగు గేట్లను ఎత్తివేశారు.
దీంతో రిజర్వాయర్ దిగువ ప్రాంతాలకు భారీగా నీరు విడుదల అవుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మెఘాద్రిగడ్డ రిజర్వాయర్‌లో ప్రస్తుతం సుమారు 5,500 క్యూసెక్కుల నీరు నిల్వగా ఉండగా, మొత్తం సామర్థ్యం 6,600 క్యూసెక్కులు. నీటి మట్టం మరింత పెరగకుండా ముందస్తు చర్యగా అధికారులు గేట్లను ఎత్తివేసినట్లు తెలిపారు.
వర్షాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని గేట్లు ఎత్తివేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.


