Wednesday, 25 March 2026
  • Home  
  • విశాఖ బాలోత్సవం పోస్టర్ ను ఆవిష్కరించిన విఎంఆర్డిఏ కమీషనర్
- విశాఖపట్నం

విశాఖ బాలోత్సవం పోస్టర్ ను ఆవిష్కరించిన విఎంఆర్డిఏ కమీషనర్

విశాఖ బాలోత్సవం పోస్టర్ ను ఆవిష్కరించిన విఎంఆర్డిఏ కమీషనర్ గారు *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* డిసెంబర్ 9 నుండి 11 వరకూ సెయింట్ ఆంథోనీ ఓల్డ్ తెలుగు ప్రైమరీ స్కూల్ లో జరిగే “విశాఖ బాలోత్సవం 3వ మెగా చిల్డ్రన్స్ ఫెస్టివల్” యొక్క పోస్టర్ ను ఈ రోజు గౌరవనీయ విఎంఆర్డిఏ కమీషనర్ శ్రీ ఎన్. భరత్ తేజ్ గారి చేతులమీదుగా కమీషనర్ గారి కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమీషనర్ గారితో బాటు , బాలోత్సవం ప్రధాన కార్యదర్శి శ్రీ జి.ఎస్. రాజేశ్వరరావు, ఆహ్వానసంఘం ఉపాధ్యక్షులు శ్రీ పి. లచ్చిరాజు, శ్రీ జి. వి. రమణ గార్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యదర్శి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈసారి బాలోత్సవాన్ని విశాఖ వ్యాలీ రోటరీ తో కలిసి సెయింట్ ఆంథోనీ స్కూల్ లో నిర్వహిస్తున్నామని , బాలోత్సవం యొక్క బుక్ లెట్స్ ను, కార్యకర్తలు 400 స్కూల్స్ కు తీసుకు వెళ్లి అందించడం జరిగిందని, స్కూల్స్ నుండి ఎంట్రీఫారాలు నింపి తిరిగి పంపే ప్రక్రియ ప్రారంభమయ్యిందని, స్పందన చాలా బాగుందని తెలియజేసేరు. గత సంవత్సరం బాలోత్సవంలో 8000 మంది పిల్లలు పాల్గొన్నారని,ఈసారి బాలోత్సవంలో ఇంకా ఎక్కువ స్కూళ్ల నుండి పిల్లలు పాల్గొనే అవకాశం వుందని తెలిపారు. డిసెంబర్ 9న జరిగే ప్రారంభ సభ కు గాని 11 న జరిగే ముగింపు సభ కు గాని ముఖ్య అతిధిగా హాజరు కావాల్సిందిగా ప్రతినిధివర్గం కమీషనర్ గారిని కోరింది. ఇందుకు కమీషనర్ గారు సానుకూలంగా స్పందిస్తూ స్కూల్ పిల్లలకు అకాడమిక్ అండ్ కల్చరల్ ఈవెంట్లలో పోటీలు నిర్వహించడం ఎంతో ముదావహమని, అందుకు విశాఖ బాలోత్సవాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. గతంలో తాను రాజమండ్రి బాలోత్సవానికి హాజరు అయ్యానని ఈసారి విశాఖ బాలోత్సవానికి కూడా వీలు చూసుకుని హాజరవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అందుకు ప్రతినిధివర్గం ధన్యవాదములు తెలియజేసింది

విశాఖ బాలోత్సవం పోస్టర్ ను ఆవిష్కరించిన విఎంఆర్డిఏ కమీషనర్ గారు
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
డిసెంబర్ 9 నుండి 11 వరకూ సెయింట్ ఆంథోనీ ఓల్డ్ తెలుగు ప్రైమరీ స్కూల్ లో జరిగే “విశాఖ బాలోత్సవం 3వ మెగా చిల్డ్రన్స్ ఫెస్టివల్” యొక్క పోస్టర్ ను ఈ రోజు గౌరవనీయ విఎంఆర్డిఏ కమీషనర్ శ్రీ ఎన్. భరత్ తేజ్ గారి చేతులమీదుగా కమీషనర్ గారి కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమీషనర్ గారితో బాటు , బాలోత్సవం ప్రధాన కార్యదర్శి శ్రీ జి.ఎస్. రాజేశ్వరరావు, ఆహ్వానసంఘం ఉపాధ్యక్షులు శ్రీ పి. లచ్చిరాజు, శ్రీ జి. వి. రమణ గార్లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కార్యదర్శి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈసారి బాలోత్సవాన్ని విశాఖ వ్యాలీ రోటరీ తో కలిసి సెయింట్ ఆంథోనీ స్కూల్ లో నిర్వహిస్తున్నామని , బాలోత్సవం యొక్క బుక్ లెట్స్ ను, కార్యకర్తలు 400 స్కూల్స్ కు తీసుకు వెళ్లి అందించడం జరిగిందని, స్కూల్స్ నుండి ఎంట్రీఫారాలు నింపి తిరిగి పంపే ప్రక్రియ ప్రారంభమయ్యిందని, స్పందన చాలా బాగుందని తెలియజేసేరు. గత సంవత్సరం బాలోత్సవంలో 8000 మంది పిల్లలు పాల్గొన్నారని,ఈసారి బాలోత్సవంలో ఇంకా ఎక్కువ స్కూళ్ల నుండి పిల్లలు పాల్గొనే అవకాశం వుందని తెలిపారు. డిసెంబర్ 9న జరిగే ప్రారంభ సభ కు గాని 11 న జరిగే ముగింపు సభ కు గాని ముఖ్య అతిధిగా హాజరు కావాల్సిందిగా ప్రతినిధివర్గం కమీషనర్ గారిని కోరింది. ఇందుకు కమీషనర్ గారు సానుకూలంగా స్పందిస్తూ స్కూల్ పిల్లలకు అకాడమిక్ అండ్ కల్చరల్ ఈవెంట్లలో పోటీలు నిర్వహించడం ఎంతో ముదావహమని, అందుకు విశాఖ బాలోత్సవాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. గతంలో తాను రాజమండ్రి బాలోత్సవానికి హాజరు అయ్యానని ఈసారి విశాఖ బాలోత్సవానికి కూడా వీలు చూసుకుని హాజరవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అందుకు ప్రతినిధివర్గం ధన్యవాదములు తెలియజేసింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.