*విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి*
ఉదయం 11:00 గంటలకు విశాఖ దక్షిణ నియోజకవర్గం జోన్ 4 కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్సీ నిర్వహించారు, ఈ కార్యక్రమం లో వివిధ వార్డులనుండి వచ్చిన అర్జీలను విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు స్వయంగా స్వికరించి ఆయా ప్రభుత్వ శాఖలా ప్రతినిధులకు అందచేశారు, అనంతరం వివిధ రకముల అనారోగ్య సమస్యలతో బాధపడిన పేద కుటుంబములకు చెందినవారు చికిత్స అనంతరము ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, గౌరవ ముఖ్య మంత్రి వర్యులు వారు, సదరు కుటుంబాల వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము చెక్కుల ద్వారా ఆర్ధిక సహాయము అందజేసినారు, సదరు చెక్కులను గౌరవ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి చేతులమీదుగా లబ్దిదారులకు చెక్యూలు పంపిణీ చేసినారు.
Cmrf లబ్దిదారుల వివరాలు:
1) 29 వార్డుకు చెందిన చెన్న జీవ రత్నం గారికి రూ, 2,00,000/-,
2) 31 వార్డుకు చెందిన విరోతి రాజేష్ గారికి రూ, రూ,47,500/-,
3) 32 వార్డుకు చెందిన కమిరెడ్డి వెంకట మోహన్ రెడ్డి గారికి రూ, 1,26,868/-.
ఈ కార్యక్రమం లో బాధితులతో పాటు ప్రభుత్వ అధికారులు, ఆ యా వార్డులకు చెందిన కూటమి వార్డ్ కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


