Sunday, 7 December 2025
  • Home  
  • విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్న NAREDCO (నరేడ్కో) ప్రాపర్టీ షో
- విశాఖపట్నం

విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్న NAREDCO (నరేడ్కో) ప్రాపర్టీ షో

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్న NAREDCO (నరేడ్కో) ప్రాపర్టీ షో ను సందర్శించిన VMRDA చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్, IAS., గాదిరాజు ప్యాలెస్ లో NAREDCO (నరేడ్కో) అధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో ను VMRDA చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ గారు మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్ గారు సంయుక్తంగా అక్కడ వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు మాట్లాడుతూ విశాఖపట్నంలో ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలవారు ఒకే తాటి పైకి వచ్చి ఇక్కడ ఈ ప్రాపర్టీ షో ను ఏర్పాటు చేయడమనేది ఎంతో ముదావహమని, ఇంత చక్కగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు నా యొక్క అభినందనలన్నారు. దీని వల్ల కొనుగోలుదారులు వారి సందేహాలను నివృత్తి చేసుకొని ప్లాట్లు కొనుగోలు చేయడం మరింత సులభతరం అవుతుందన్నారు. గౌ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల విశాఖకు టీసీఎస్, గూగుల్ వంటి ఐటీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని ఈ చర్యలవల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపు అందుకొని ఉత్తరాంధ్ర – ఉత్తమ ప్రాంతంగా మారుతుందన్నారు. రానున్న రోజుల్లో విశాఖ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, అందుకు తగిన సదుపాయాలు, వాతావరణం కల్పించటం జరుగుతుందని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు కు అనుసంధానించే ప్రధాన రహదారులు కూడా త్వరలోనే పూర్తి చేయనున్నామని, వి ఎం ఆర్ డి ఎ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్.తేజ్ భరత్ గారు మాట్లాడుతూ గౌ ముఖ్యమంత్రి వర్యులు విశాఖను రాష్ట్రంలోనే కాకుండా దేశం మరియు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని , నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ ప్రాంతమంతా ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం లో పెట్టుబడులు చాలా మంచి నిర్ణయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జి సి సి చైర్మన్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు, NAREDCO (నరేడ్కో) ప్రతినిధులు శ్రీ చక్రధర్, శ్రీ సురేష్ శ్రీ సుబ్బారావు, శ్రీ హుస్సేన్, శ్రీ వెంకన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్న NAREDCO (నరేడ్కో) ప్రాపర్టీ షో ను సందర్శించిన VMRDA చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్, IAS.,

గాదిరాజు ప్యాలెస్ లో NAREDCO (నరేడ్కో) అధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో ను VMRDA చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ గారు మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్ గారు సంయుక్తంగా అక్కడ వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు మాట్లాడుతూ విశాఖపట్నంలో ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలవారు ఒకే తాటి పైకి వచ్చి ఇక్కడ ఈ ప్రాపర్టీ షో ను ఏర్పాటు చేయడమనేది ఎంతో ముదావహమని, ఇంత చక్కగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు నా యొక్క అభినందనలన్నారు. దీని వల్ల కొనుగోలుదారులు వారి సందేహాలను నివృత్తి చేసుకొని ప్లాట్లు కొనుగోలు చేయడం మరింత సులభతరం అవుతుందన్నారు. గౌ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల విశాఖకు టీసీఎస్, గూగుల్ వంటి ఐటీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని ఈ చర్యలవల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపు అందుకొని ఉత్తరాంధ్ర – ఉత్తమ ప్రాంతంగా మారుతుందన్నారు. రానున్న రోజుల్లో విశాఖ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, అందుకు తగిన సదుపాయాలు, వాతావరణం కల్పించటం జరుగుతుందని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు కు అనుసంధానించే ప్రధాన రహదారులు కూడా త్వరలోనే పూర్తి చేయనున్నామని, వి ఎం ఆర్ డి ఎ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్.తేజ్ భరత్ గారు మాట్లాడుతూ గౌ ముఖ్యమంత్రి వర్యులు విశాఖను రాష్ట్రంలోనే కాకుండా దేశం మరియు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని , నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ ప్రాంతమంతా ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం లో పెట్టుబడులు చాలా మంచి నిర్ణయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జి సి సి చైర్మన్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు, NAREDCO (నరేడ్కో) ప్రతినిధులు శ్రీ చక్రధర్, శ్రీ సురేష్ శ్రీ సుబ్బారావు, శ్రీ హుస్సేన్, శ్రీ వెంకన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.