Tuesday, 24 March 2026
  • Home  
  • విశాఖ ఉత్సవ్‌లో జనవరి 30న ముగ్గుల పోటీలు
- విశాఖపట్నం

విశాఖ ఉత్సవ్‌లో జనవరి 30న ముగ్గుల పోటీలు

విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జనవరి 30వ తేదీన ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ పోటీలు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరగనున్నాయి. సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గలవారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ కార్యాలయం సూచించింది. ఉత్తమ ముగ్గులు వేసిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి)

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జనవరి 30వ తేదీన ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
ఈ పోటీలు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరగనున్నాయి.
సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గలవారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ కార్యాలయం సూచించింది.
ఉత్తమ ముగ్గులు వేసిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.